Shiva Sena : శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు మళ్లీ ఈడీ సమన్లు

X
By - Divya Reddy |20 July 2022 10:04 AM IST
Shiva Sena : శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు మళ్లీ సమన్లు పంపింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.
Shiva Sena : శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు మళ్లీ సమన్లు పంపింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. మనీలాండరింగ్ కేసులో ఈ నెల1న దాదాపు 10గంటల పాటు విచారించిన ఈడీ.. తాజాగా ఇవాళ మరోసారి విచారణకు హాజరు కావాలంటూ సమన్లు ఇచ్చింది. ముంబయిలోని గోరెగావ్ పాత్రచాల్ భూకుంభకోణం, ఇతర ఆర్థిక వ్యవహారాల్లో మనీలాండరింగ్ కేసులో సంజయ్ రౌత్ భార్య, ఆయన స్నేహితుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా రౌత్‌కు ఈడీ గతంలో సమన్లు జారీ చేసింది. తనకు ఈడీ సమన్లు ఇవ్వడాన్ని కుట్రగా పేర్కొన్న రౌత్‌ను ఈడీ విచారించింది. ఇప్పుడు మరోసారి ఆయనకు సమన్లు జారీ చేసింది ఈడీ. ఇవాళ ఆయన్ను విచారించనుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com