ఫేక్ ప్రొఫైల్ తయారు చేసి.. 15 మందిని వివాహం చేసుకుని..

ఫేక్ ప్రొఫైల్ తయారు చేసి.. 15 మందిని వివాహం చేసుకుని..
ఈ మధ్య పెళ్లిళ్లు చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది.. ఉద్యోగానికి అప్లై చేసినట్లు మన బయోడేటా మ్యాట్రిమోనియల్ లో పెడితే సంబంధం సెట్ చేసేస్తున్నాయి సంస్థలు..

ఈ మధ్య పెళ్లిళ్లు చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది.. ఉద్యోగానికి అప్లై చేసినట్లు మన బయోడేటా మ్యాట్రిమోనియల్ లో పెడితే సంబంధం సెట్ చేసేస్తున్నాయి సంస్థలు.. అదృష్టం బావుంటే సక్సెస్ అవుతున్నాయి. అలా అని తెలిసిన సంబంధాలు చేసుకున్నా సక్సెస్ అవుతున్నాయా అంటే అదీ డౌటే.. అయితే ఈ మ్యాట్రిమోని పేరుతో మోసాలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. ఎంత జాగ్రత్తగా వివరాలు సేకరించినా నిలువునా ముంచేస్తున్నారు. కర్ణాటకలో ఓ ప్రబుద్ధుడు 15మంది అమ్మాయిలను మ్యాట్రిమోని ద్వారానే వివాహం చేసుకున్నాడంటే అది ఎంత సవ్యంగా ఉందో అర్థమవుతోంది.

కర్నాటకలో 15 మంది మహిళలను వివాహం చేసుకున్న వ్యక్తి ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేకపోవడంతో బుక్కైపోయాడు. ఇంగ్లిష్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగా లేకపోవడంతో చాలా మంది మహిళలు తనను తిరస్కరించారని అందుకే పేక్ ప్రొఫైల్ తయారు చేసుకుని పెళ్లిళ్లు చేసుకున్నానని నిందితుడు పోలీసులకు చెప్పాడు.

మైసూరు జిల్లాలో 15 మంది మహిళలను మోసం చేసి పెళ్లి చేసుకున్న వ్యక్తిని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితులు అతడిపై ఫిర్యాదు చేయడంతో అతడి ఆటలకు అడ్డుకట్ట పడింది. నిందితుడిని బెంగళూరులోని బనశంకరి ప్రాంతానికి చెందిన మహేష్ కెబి నాయక్‌గా గుర్తించారు. 35 ఏళ్ల నిందితుడు పెళ్లి తర్వాత డబ్బు, నగలతో పారిపోయేవాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు 2014 నుంచి ఇప్పటి వరకు 15 మందికి పైగా మహిళలను పెళ్లి చేసుకున్నాడు.

నిందితుడి స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్‌పై ఆమెకు అనుమానం వచ్చి అతని గురించిన సమాచారం సేకరించి మైసూరులో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు ఫేక్ మ్యాట్రిమోనియల్ ప్రొఫైల్ తయారు చేసి మహిళలను ట్రాప్ చేశారని పోలీసులు తెలిపారు. అతను తనను తాను ఒకసారి ఇంజనీర్ అని మరొకసారి డాక్టర్ అని చెప్పుకునేవాడు. తుమకూరు నగరంలో నకిలీ క్లినిక్‌ ఏర్పాటు చేసి నర్సును కూడా పెట్టుకున్నాడు. నిందితుడికి నలుగురు పిల్లలు ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది.

Tags

Read MoreRead Less
Next Story