Amit Shah : జైలుకెళ్తే ప్రధాని అయినా రాజీనామా చేయాల్సిందే

Amit Shah : జైలుకెళ్తే ప్రధాని అయినా రాజీనామా చేయాల్సిందే
X

ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి జైలు నుంచే పరిపాలన చేయడం ప్రజాస్వామ్యానికి మర్యాదపూర్వకం కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, మాజీ ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ రాజీనామా వంటి పలు అంశాలపై ఆయన మాట్లాడారు. విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ.. ‘‘విపక్షాలు ఇప్పటికీ జైలుకు వెళ్తే సులభంగా ప్రభుత్వాలు ఏర్పాటుచేయవచ్చని భావిస్తున్నాయి. అప్పుడు జైలునే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అధికారిక నివాసాలుగా మార్చేస్తారు. దీనివల్ల డీజీపీ, చీఫ్ సెక్రటరీ, క్యాబినెట్ సెక్రటరీ వంటి ఉన్నతాధికారులు జైలు నుంచే ఆదేశాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సిద్ధాంతాలను నేను, నా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మన దేశంలో జైలు నుంచే ప్రభుత్వాలను నడిపే పరిస్థితి రాకూడదు’’ అని అమిత్ షా స్పష్టం చేశారు.

Tags

Next Story