మణిపూర్‌ హింసలో విదేశీ శక్తుల హస్తం: మాజీ ఆర్మీ ఛీఫ్

మణిపూర్‌ హింసలో విదేశీ శక్తుల హస్తం: మాజీ ఆర్మీ ఛీఫ్

Manipur- Naravane: మణిపూర్ రాష్ట్రంలో చెలరేగిన హింసాకాండలో విదేశీ ఏజెన్సీలు, సంస్థల ప్రమేయాన్ని తోసిపుచ్చలేమని భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ MM నరవాణే సంచలన వాఖ్యలు చేశాడు. వివిధ తిరుగుబాటు గ్రూపులకు చైనా సహాయం అందిస్తుంది అని ఆరోపించారు. సరిహద్దు రాష్ట్రాల్లో అస్థిరత్వం కొనసాగితే దేశానికి మంచిది కాదన్నారు. మణిపూర్‌లో హింస కొనసాగితే కొంతమందికి లబ్ధి చేకూరుతుందని, అటువంటి వారు అక్కడ శాంతి నెలకొల్పడానికి యత్నించరని అన్నాడు.

'జాతీయ భద్రతా కోణం' అనే అంశంపై జర్నలిస్టులతో, మణిపూర్‌ హింసాకాండపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.


ఈ అంశంలో సరైన నిర్ణయాలు, సరైన చర్యలు తీసుకునే బాధ్యత కలిగున్న వారు చేయాల్సిందంతా చేస్తున్నారన్నాడు. "విదేశీ సంస్థలు, వ్యక్తుల ప్రమేయం ఉందనే అంశాన్ని నేను తిరస్కరించను. ముఖ్యంగా చైనా తిరుగుబాటుదారులకు మద్దతు ఇవ్వొచ్చు" అని వెల్లడించారు. చైనా తిరుగుబాటుదారులకు ఎప్పటి నుంచో మద్దతు ఇస్తోందని, అది ఇప్పటికీ కొనసాగుతోందని అన్నాడు.

ఈశాన్య రాష్ట్రాల్లో అక్రమంగా డ్రగ్ రవాణా ఇప్పుడే కొత్తగా రాలేదని, ఎప్పటి నుంచో ఉన్నదేనన్నాడు. కొద్ది సంవత్సరాలుగా డ్రగ్స్ పట్టుబడటం పెరిగిందన్నాడు. థాయ్‌లాండ్, మయన్మార్, లావోస్‌లు కలిసే గోల్డెన్ ట్రయాంగిల్‌కి మన ప్రాంతాలు దగ్గరగా ఉండటం, మయన్మార్‌ అస్థిర ప్రభుత్వం ఉండటంతో డ్రగ్ సరఫరాకి అవకాశం ఎప్పటి నుంచో ఉందన్నాడు.

అగ్నిపథ్‌పై ప్రశ్నించగా కాలమే దానికి సమాధానం చెబుతుందన్నాడు. ఆర్థిక కారణాలే ఈ పథకం ఆవిష్కరణకు కారణమని అంతా భావిస్తున్నప్పటికీ అది కారణం కాదని, మనకు యువసైన్యం అవసరం ఉన్నందునే ఎన్నో సంప్రదింపుల తర్వాత ఈ పథకాన్ని తీసుకువచ్చారన్నాడు.

గాల్వాన్ లోయలో చైనా సైనికులతో హింసాత్మక ఘటనలకు చైనా ఎందుకు పూనుకుందో తమకి ఇప్పటికీ అర్ధం కాలేదన్నాడు. కోవిడ్‌తో ప్రపంచం సతమతం అవుతున్న వేళ చైనా ఎందుకు ఈ దుస్సాహసానికి పాల్పడిందో దానికి గల కారణాలు అంతుచిక్కలేదన్నారు.





Tags

Read MoreRead Less
Next Story