బీహార్ ముఖ్యమంత్రిని కలిసిన మాజీ డీజీపీ గుప్తేశ్వర్

బీహార్ ముఖ్యమంత్రిని కలిసిన మాజీ డీజీపీ గుప్తేశ్వర్

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండే భేటీ అయ్యారు. ఉదయం నేరుగా పాట్నాలోని సీఎం నివాసానికి వెళ్లిన గుప్తేశ్వర్ పాండే నితీష్ కుమార్ తో గంటపాటు సమావేశం అయ్యారు. అయితే తాను సీఎం కలిసి రాజకీయాలు మాట్లాడలేదని అన్నారు.. డీజీపీగా తనకు సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చినందున సీఎంకు కృతజ్ఞతలు తెలిపానన్నారు. అయితే ఆయన జేడీయూలో చేరే అంశంపైనే చర్చించడానికి సీఎంను కలిశారన్న ప్రచారం కూడా జరుగుతోంది. కాగా గతవారం బీహార్ డీజీపీ పదవికి వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించారు గుప్తేశ్వర్ పాండే. ఆ తరువాత రెండురోజులకు మాట్లాడిన ఆయన రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు.

Tags

Next Story