Rajasthan: పిల్లలను ఎస్‌ఐ చేయాలని పేపర్ లీక్ చేసిన రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారి
రాజస్థాన్‌లో ఎస్‌ఐ పరీక్షల అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడే తన పిల్లలను సబ్-ఇన్‌స్పెక్టర్లను చేసేందుకు పరీక్షపత్రం లీక్ చేసిన వైనం బయటపడింది. 2021లో నాటి రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఆర్పీఎస్‌సీ) సభ్యుడు రాము రాం రైకా తన కుమారుడు, కుమార్తె కోసం ఆ ఏడాది ఎస్‌ఐ పరీక్షల పత్రం లీక్ చేశాడు. ఈ పరీక్షలో అతడి పిల్లలు ఇద్దరూ టాపర్లుగా నిలిచారు. కాగా ఈ కేసులో అధికారులు రైకాను అరెస్టు చేశారు.
రైకా 2018-2022 వరకు ఆర్పీఎస్‌సీ సభ్యుడిగా ఉన్నాడు. 2023 నుంచి కమిషన్ సభ్యుడైన బీఎల్ కటారకు కూడా ఈ కేసుతో సంబంధం ఉండటంతో అధికారులు ప్రశ్నించారు. ఇతడిని 2022లో సీనియర్ టీచర్ రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలకు సంబంధించి అరెస్టు చేశారు. 2021 ఎస్‌ఐ పరీక్ష ఇంటర్వ్యూ ప్యానెల్‌లోనూ ఇతను సభ్యుడు. ఇప్పటికే రైకా పిల్లలు-ట్రైనీ ఎస్‌ఐలు శోభా, దేవేశ్‌ను అరెస్టు చేశారు. వీరితో పాటు మనోజ్ దేవ్, అవినాశ్, విజేందర్ కుమార్ అనే ట్రైనీలను అదుపులోకి తీసుకొన్నారు. వీరికి మళ్లీ అదే పరీక్ష నిర్వహించగా.. గత, ఇప్పటి మార్కులు చూసి అధికారులు అవాక్కయ్యారు. రైకా కుమార్తె శోభాకు 2021 పరీక్షల్లో హిందీలో 200కు 189, జీకేలో 200కు 155 మార్కులు వచ్చాయి. ఈసారి మాత్రం కేవలం 24, 34 వచ్చాయి. ఈమెకు 2021 పరీక్షల్లో ఐదో ర్యాంక్ వచ్చింది. రైకా కుమారుడు దేవేశ్‌కు గతంలో 40వ ర్యాంక్ వచ్చింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 38 మంది ట్రైనీ ఎస్‌ఐలను అరెస్టు చేశారు.
ఇప్పటివరకు, 2021 సబ్-ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో 61 మంది నిందితులపై మూడు వేర్వేరు ఛార్జిషీట్లు దాఖలు చేయబడ్డాయి. వారిలో 33 మంది ట్రైనీ సబ్-ఇన్‌స్పెక్టర్లు, నలుగురు ఎంపికైన అభ్యర్థులు సర్వీస్‌లో చేరనివారు మరియు 24 మంది అసోసియేట్‌లు పేపర్ లీక్ ముఠా.ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 65 మంది అనుమానితుల కోసం SOG చురుకుగా శోధిస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com