Loksabha Elections 2024: ఎన్నికల ఫలితాలను తేల్చే ఎగ్జిట్ పోల్స్

ఎగ్జిట్ పోల్స్ పై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. కాగా.. రేపు సాయంత్రం 6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని తెలిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126 ఏ (1) ప్రకారం నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. కాగా.. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలపై వివిధ టీవీ చానళ్లు నిర్వహించే చర్చల్లో పాల్గొనరాదని కాంగ్రెస్ నిర్ణయించింది. ఊహాగానాలు, టీఆర్‌పీల కోసం బురద జల్లుడు వ్యవహారాల్లో పాల్గొనబోమని పేర్కొన్నది.
ఎగ్జిట్ పోల్ అంటే ఏమిటి?
ఎగ్జిట్ పోల్: ఎన్నికల పోలింగ్ రోజు బూత్ నుంచి బయటికొచ్చే ఓటరు నుంచి అభిప్రాయాలు సేకరించడాన్ని ఎగ్జిట్ పోల్ అంటారు. ఓటరు ఎగ్జిట్ పోల్‌లో ఏ పార్టీకి ఓటేశాననే విషయాన్ని నిజాయితీగా చెప్పే అవకాశం ఉంది.
టైమింగ్: ఎగ్జిట్ పోల్స్ ఎన్నికలు ముగిసిన రోజు వెలువడతాయి. ఓటింగ్‌ను బట్టి ఫలితాలను అంచనా వేసే అవకాశం కూడా ఉంది.
ఓటర్ల శాంపిల్స్ : ఎగ్జిట్ పోల్స్ ఓటు వేసి వచ్చిన తర్వాత డేటాను సేకరిస్తాయి. అందుకే కొంత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమయ్యే అవకాశం ఉంది.
క్వశ్చనింగ్: ఎగ్జిట్ పోల్‌లో భాగంగా సర్వే సంస్థలు ఏ అభ్యర్థికి లేదా పార్టీకి ఓటేశారని ఓటరును అడుగుతాయి.
ప్రిడిక్టివ్ వాల్యూ: ఓటేసిన తర్వాత ఓటరు అభిప్రాయాన్ని తెలుసుకోవడం వల్ల ఎగ్జిట్ పోల్స్‌లో కొంత వరకు కచ్చితత్వం ఉండే అవకాశం ఉంది.
నిబంధనలు: ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్ 126ఏలో ఓ నిబంధన ఉంది. ఏ రాష్ట్రంలోనైనా చివరి దశ ఓటింగ్ ముగిసిన 30 నిమిషాల తర్వాత ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించవచ్చు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ 1957లో రెండో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దేశంలో మొదటిసారిగా ఎగ్జిట్ పోల్‌ను నిర్వహించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com