ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి ఆపరేషన్.. చూపు కోల్పోయిన 18 మంది రోగులు

ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి ఆపరేషన్.. చూపు కోల్పోయిన 18 మంది రోగులు
రాజస్థాన్‌లోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అయిన సవాయ్ మాన్ సింగ్ (SMS) ఆసుపత్రిలో ఆపరేషన్ తర్వాత 18 మంది ఒక కంటి చూపును కోల్పోయారు.

రాజస్థాన్‌లోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అయిన సవాయ్ మాన్ సింగ్ (SMS) ఆసుపత్రిలో ఆపరేషన్ తర్వాత 18 మంది ఒక కంటి చూపును కోల్పోయారు. వారు కంటిశుక్లం ఆపరేషన్ చేయించుకున్న తర్వాత చూపు కోల్పోయామని ఆరోపించారు. వీరిలో చాలా మందికి రాజస్థాన్ ప్రభుత్వం చిరంజీవి ఆరోగ్య పథకం కింద ఆపరేషన్లు చేశారు.

ఆపరేషన్ చేయించుకున్న ఓ వ్యక్తి మాట్లాడుతూ.. “నాకు జూన్ 23 న ఆపరేషన్ జరిగింది. జూలై 5 వరకు నాకు కంటి చూపు ఉంది, ప్రతిదీ కనిపించింది కాని జూలై 6-7 నుండి కంటి చూపు పోయింది. ఆ తర్వాత మళ్లీ ఆపరేషన్‌ చేసినా చూపు తిరిగి రాలేదు. కంటి చూపు కోల్పోవడానికి కారణం ఇన్‌ఫెక్షన్ అని వైద్యులు చెప్పారని అన్నారు.

తీవ్రమైన కంటి నొప్పి అని రోగులు ఫిర్యాదు చేయడంతో, ఆసుపత్రి అధికారులు వారిని మళ్లీ ఆసుపత్రిలో జాయినవ్వమని కోరారు. వారిలో కొందరికి రెండు కంటే ఎక్కువ సార్లు శస్త్రచికిత్సలు జరిగాయి. కానీ కోల్పోయిన దృష్టిని తిరిగి పొందలేకపోయారు.

అయితే ఆసుపత్రిలోని ఆప్తమాలజీ విభాగం అధికారులు తమ వైపు నుండి ఎటువంటి లోపం లేదని పేర్కొన్నారు. రోగుల నుండి ఫిర్యాదులను స్వీకరించిన తర్వాత దర్యాప్తు జరుగుతుందని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story