IAS Officer: ముఖం కప్పుకుని సర్కార్ ఆస్పత్రికెళ్లిన లేడీ ఐఏఎస్

ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి పై వరుస ఫిర్యాదులు అందడంతో రహస్యంగా తనిఖీ చేయాలని ఓ ఐఏఎస్ అధికారిణి నిర్ణయించుకున్నారు. ముఖం కప్పుకుని రోగి మాదిరిగా, ఆ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి.. ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడి సిబ్బందికి షాక్ ఇచ్చింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లోని దీదా మాయి ఆరోగ్య కేంద్రంలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, అసౌకర్యాలపై ఆ జిల్లా కలెక్టరేట్‌కు పలు ఫిర్యాదులు అందాయి. ఉదయం పది గంటలు దాటినప్పటికీ డాక్టర్లు అందులోబాటులో ఉండటం లేదని పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో ఆకస్మికంగా తనిఖీ చేయాలని ఆ జిల్లా డిప్యూటీ కలెక్టర్ కృతి రాజ్ నిర్ణయించారు.
ఈ క్రమంలో ఐఏఎస్ అధికారి కృతి రాజ్ బుధవారం (మార్చి 13) రోగి మాదిరి ముసుగు ధరించి ఆసుపత్రికి వెళ్లి.. అక్కడ డాక్టర్ చెకప్‌కు వెళ్లారు. అయితే డాక్టర్ ప్రవర్తన సరిగా లేకపోవడాన్ని అధికారిణి కృతి గ్రహించారు. అంతేకాకుండా అక్కడ ఆసుపత్రి మెడికల్ స్టాక్ స్టోర్‌లో చాలా మందులు గడువు ముగిసినవి ఉన్నట్లు గుర్తించారు. హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేయగా రిజిస్టర్‌లో కొందరి సంతకాలు ఉన్నా.. ఆ సిబ్బంది అక్కడ లేకపోవడం, విధుల్లో ఉన్న సిబ్బంది సేవల తీరు సరిగా లేకపోవడాన్ని ఆమె గుర్తించి, ఆగ్రహించారు. అసుపత్రి కూడా అపరిశుభ్రంగా ఉన్నట్లు పేర్కొన్నారు. . అంతేకాకుండా అక్కడి మెడికల్ స్టోర్‌లో చాలా మందులు గడువు ముగిసినవి ఉన్నాయని గుర్తించారు.
ఇక సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్‌ను తనిఖీ చేయగా అందులో సంతకాలు ఉన్నా.. సిబ్బంది అక్కడ లేకపోవడం, విధుల్లో ఉన్న సిబ్బంది సరిగా సేవలు అందించకపోవడాన్ని డిప్యూటీ కలెక్టర్ గుర్తించారు. ఇక ఆస్పత్రి కూడా అపరిశుభ్రంగా ఉన్నట్లు ఆమె గుర్తించారు. తనిఖీలు నిర్వహించిన తర్వాత కృతి రాజ్ మీడియాతో మాట్లాడారు. కుక్క కాటు ఇంజెక్షన్ వేయడానికి ఉదయం 10 గంటల తర్వాత కూడా డాక్టర్ అందుబాటులో లేరని ఫిర్యాదు అందడంతో తానే నేరుగా ఆస్పత్రికి వెళ్లినట్లు తెలిపారు. రోగుల పట్ల ఆ డాక్టర్ ప్రవర్తించే తీరు కూడా సరిగా లేదని తెలిపారు. దీదా మాయి ప్రభుత్వ ఆస్పత్రి పరిస్థితిపై త్వరలో ఉన్నతాధికారులకు నివేదిక పంపుతానని డిప్యూటీ కలెక్టర్ కృతి రాజ్ స్పష్టం చేశారు. , ఐఏఎస్ అధికారిణి కృతి ముఖానికి ముసుగు వేసుకుని, సాధారణ రోగి మాదిరిగా ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన వీడియో క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాజీ యుపీ సీఎం అఖిలేష్ యాదవ్ ఎస్‌డిఎమ్ తనిఖీ నిర్వహిస్తున్న ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. యూపీలో వైద్య మౌలిక సదుపాయాల స్థితిని ఎద్దేవా చేస్తూ బీజేపీ నేతృత్వంలోని యోగి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఈ ఆకస్మిక తనిఖీ తర్వాత ఐఏఎస్ అధికారిని బదిలీ అయ్యే అవకాశం ఉందని అఖిలేష్ యాదవ్ తన ఎక్స్ అకౌంట్‌లో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com