Anantnag encounter: కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌..

Anantnag encounter: కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌..
కంటతడి పెట్టిస్తున్న హుమయూన్‌ ఫోన్‌కాల్‌..

జమ్ముకశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ఐ దోరోజూ కొనసాగుతోంది. గాదోల్ అటవీ ప్రాంతంలో నక్కిన ముష్కరుల కోసం సైనికులు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఇవాళ గాలింపు చర్యలను పర్వత ప్రాంతానికి సమీపాన ఉన్న గ్రామాలకు విస్తరించామని ఓ అధికారి తెలిపారు. దట్టమైన అడవుల్లో నిఘా కోసం డ్రోన్లు, హెలికాప్టర్లు వినియోగిస్తున్నామని చెప్పారు. ముష్కరుల కాల్పుల్లో ఇద్దరు సైనికాధికారులు, ఒక పోలీస్ అధికారి మృతి చెందగా నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని వెల్లడించారు. ఇవాళ గాలింపు చర్యలు మెుదలు కాగానే సైనికులు అటవీ ప్రాంతంలోకి మోటార్ షెల్స్ ను ప్రయోగించాయి. శుక్రవారం సైన్యం మోటార్ షెల్స్ ఉన్న స్థావరం దెబ్బతింది. అందులోంచి ఉగ్రవాదుల పారిపోతున్న దృశ్యాలు సైనికాధికారులు డ్రోన్ ఫుటేజీలో గుర్తించారు. బలగాల కాల్పుల్లో ఇప్పటివరకూ ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. మిగతావారి కోసం వేట కొనసాగుతోంది.


ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉన్నతాధికారులతో పాటు ఒక జవాన్ మరణించారు. కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ , జమ్మూ కాశ్మీర్ డీఎస్పీ హుమాయున్ భట్ మరణించారు. ముగ్గురు ఉన్నతాధికారులు చనిపోవడంతో ఇటు ఆర్మీ, అటు పోలీసులతో పాటు యావత్ దేశ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే తీవ్రంగా గాయపడిన హుమాయున్ భట్ చివరి మాటలు అందరి గుండెల్ని పిండేస్తున్నాయి. అందరితో కన్నీరు పెట్టిస్తున్నాయి. తాను చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు భార్య ఫాతిమాతో వీడియో కాల్ లో మాట్లాడారు.‘‘ తాను ఇక బతకకపోవచ్చని, తన బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలని’’ తన కుటుంబానికి వీడియో కాల్ లో చెప్పారు. హుమాయున్ భట్ తన మ్యారేజ్ అనివర్సరీకి రెండు వారాల ముందు వీరమరణం పొందారు. తనకు కొడుకు జన్మించి కేవలం కొన్ని రోజుల మాత్రమే అయ్యాయి.


తాను ఎన్‌కౌంటర్ ప్రాంతం నుంచి భట్ తండ్రితో మాట్లాడానని, రెస్క్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నాయని, అతడిని కొండపై నుంచి కిందికి దించుతున్నామని, మేం ఏం చేస్తున్నామో అన్నింటిని భట్ తండ్రికి చూపించామని జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. విపరీతమైన రక్తస్రావంతో డీఎస్పీ హుమాయున్ భట్ మరణించారు. భట్ తండ్రి కూడా గతంలో జమ్మూకాశ్మీర్ పోలీసు డిపార్ట్మెంట్ లో పనిచేశారు.

Tags

Read MoreRead Less
Next Story