Ayodhya: అద్భుతంగా రూపుదిద్దుకున్న అయోధ్య రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్ట్

అయోధ్యలో నూతనంగా నిర్మించిన మహర్షి వాల్మీకి విమానాశ్రయం, ఆధునీకరించిన రైల్వేస్టేషన్ను...రామాలయంలా తీర్చిదిద్దారు. అధునాతన సౌకర్యాలతోపాటు రాముడి జీవితాన్ని వర్ణించేలా విమానాశ్రయాన్ని నిర్మించారు. ఏటా 10లక్షల మందికి సేవలందించేలా ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయానికి ఏమాత్రం తీసుపోని విధంగా అత్యాధునిక వసతులతో రైల్వే స్టేషన్‌ను కూడా తీర్చిదిద్దారు.
అయోధ్య రాములోరి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అంతర్జాతీయ విమానాశ్రయానికి రామాయణాన్ని రచించిన మహా రుషి వాల్మీకి పేరు పెట్టారు. మహర్షి వాల్మీకి అయోధ్యాధామం అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలవనున్నారు. విమానాశ్రయం తొలిదశ నిర్మాణ పనులకు 14వందల 50కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 6 వేల 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ ఉంటుంది. ఏటా 10లక్షల మందికి సేవలందించే సామర్థ్యంతో విమానాశ్రయాన్ని నిర్మించారు. అయోధ్యకు 15కిలోమీటర్ల దూరంలో ఎయిర్‌పోర్టును నిర్మించారు. హిందూ సంప్రదాయం ఊట్టిపడేలా అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దారు.
టెర్మినల్ ముఖభాగం రామమందిర నమూనాలా తీర్చిదిద్దారు. శ్రీరాముని జీవితాన్ని వర్ణించేలా లోపలి ఇంటీరియర్ డిజైన్ చేశారు. లోపలి గోడలపై స్థానిక కళలు, ఆధ్మాత్మిక చిత్రాలు రాముడి జీవితాన్ని వర్ణించే పెయింటింగ్స్ వేశారు. రామయణంలోని ముఖ్యఘట్టాలను స్ఫూర్తిగా తీసుకొని వేసిన మ్యూరల్ పెయింటింగ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇన్సులేటెడ్ రూఫింగ్ సిస్టమ్, LED లైటింగ్, రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్, ఫౌంటైన్ ల్యాండ్ స్కేపింగ్, మురుగునీటి శుద్ధి కర్మాగారం, సోలార్ పవర్ ప్లాంట్ వంటి సదుపాయాలు ఉన్నాయి.
మరోవైపు అయోధ్య రైల్వేస్టేషన్ సైతం కొత్తశోభను సంతరించుకుంది. ఎయిర్ పోర్టుకు ఏమాత్రం తీసిపోని విధంగా అత్యాధునిక వసతులతో ఆధునికరించారు. స్టేషన్ ముఖద్వారంపై మకుటం, గోడలపై విల్లుతరహా నిర్మాణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. రెండేళ్లక్రితం ఆధునికీకరణ పనులు చేపట్టారు. స్టేషన్ నిర్మాణానికి కాంక్రీటుతోపాటు సున్నపురాయితో చేసిన పిల్లర్లను ఉపయోగించారు. 3 అంతస్థులు ఉండే భవనానికి ఇరువైపుల ఆలయాన్ని ప్రతిబించేలా శిఖరాలు నిర్మించారు. రాత్రి సమయంలో మెరిసేలా విద్యుత్ కాంతులతో అలకరించారు. అయోధ్యలో రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఒకటి అయోధ్య జంక్షన్ రెండోది ఫైజాబాద్‌లోని అయోధ్య కంట్మోనెంట్. పేర్ల విషయంలో అయోమయం లేకుండా అయోధ్య జంక్షన్‌ను అయోధ్యధామ్ జంక్షన్‌గా పేరు మర్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com