IMA:నేడు దేశవ్యాప్తంగా వైద్యసేవలు బంద్..

కోల్‌కతా నగరంలో జరిగిన ట్రైని డాక్టర్ అత్యాచార ఘటన నేపథ్యంలో నేడు దేశ వ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేయనున్నారు. కోల్‌కతాలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఫ్యాకల్టీ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అధికారికంగా ఈ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో నేడు దేశ వ్యాప్తంగా ఓపిడి, ఓటి సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని శుక్రవారం నాడు దేశ ప్రజలకు ముందస్తు సమాచారాన్ని తెలియజేసింది. నేడు కేవలం ఎమర్జెన్సీ పరిస్థితిలో కేసులు చూడ్డానికి మాత్రమే ఆసుపత్రిలో డాక్టర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రస్తుతం కోల్‌కతా వైద్యురాలి హత్య జరగడం దేశాన్ని కలవరం సృష్టిస్తోంది.
కోల్‌కతా నగరంలోని ఆర్ జి కర్ ఆసుపత్రి ప్రాంగణంలోనే ట్రైనీ వైద్యురాలు అత్యంత ఘోరంగా అత్యాచారానికి గురికావడం సంచలనగా మారింది. ఆమెకు పోస్టుమార్టం చేయగా.. ఆమెపై సామూహిక అత్యాచారానికి గురైనట్లు రిపోర్ట్స్ వచ్చాయి. ఈ రిపోర్టులో మహిళా వైదిరాలిలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అంటే ఆ మహిళ వైద్యురాలని మానవ మృగాలు ఎంత తీవ్రంగా నరకాయాతను చూపెట్టారో ఇట్టే అర్థమవుతోంది. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనకు నిరసనగా నేడు (ఆగష్టు 17) దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. నేటి ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు వైద్యసేవలను నిలిపేస్తున్నట్లు ఐఎంఏ తెలిపింది. అత్యవసర వైద్యసేవలు మాత్రమే పని చేస్తాయని ఫ్యాకల్టీ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (FAIM) ప్రకటించింది. కాగా.. ట్రైనీ డాక్టర్ హత్య కేసులో నిందితులను శిక్షించాలని వైద్యులు నిరసన దేశ వ్యాప్తంగా తెలుపుతున్నారు. ఇవాళ కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో వారు భేటీ కాబోతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com