Fake Currency: నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించిన నక్సలైట్లు..

Fake Currency: నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించిన నక్సలైట్లు..
X
ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో తొలిసారి స్వాధీనం చేసుకొన్న బలగాలు

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు తయారు చేసిన నకిలీ కరెన్సీ భారీ మొత్తంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు ఆయుధాలను, ఫేక్ కరెన్సీ తయారీకి వినియోగించే సామగ్రిని ఘటనాస్థలిలో గుర్తించినట్లు తెలిపారు. తమ రాకను గమనించి నక్సలైట్లు పారిపోయినట్లు వెల్లడించారు. నక్సల్స్‌పై కీలక విజయం సాధించినట్లు సుక్మా జిల్లా ఎస్పీ తెలిపారు

ఛత్తీస్‌గఢ్‌ ఏజెన్సీలో భద్రతా దళాలు ఆదివారం చేపట్టిన జాయింట్‌ ఆపరేషన్‌లో మావోయిస్టుల స్థావరంలో ఆయుధాలతోపాటు దొంగనోట్ల ముద్రణ సామగ్రి దొరకడం సంచలనంగా మారింది. జాయింట్‌ ఆపరేషన్‌లో భాగంగా భద్రతా బలగాలు సుక్మా జిల్లాలోని కొరాజ్‌గూడ అడవుల్లో మావోయిస్టుల స్థావరంపై దాడులు చేశారు. అక్కడ నకిలీ నోట్ల పేపర్లు, వాటి తయారీ యంత్రాలు(కలర్‌ జిరాక్స్‌, స్కానర్స్‌), ఇన్వర్టర్‌, క్యాట్రిడ్జులు, ద్రవ రసాయనాలు లభించాయి. రెండు తుపాకులు, వాకీ టాకీలు, విప్లవ సాహిత్యాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎన్నడూ లేనివిధంగా మావోయిస్టులు నకిలీ నోట్ల ముద్రణకు పాల్పడడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

చత్తీస్‌గఢ్‌లోనే సుక్మా జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లు మృతిచెందారు. మరో ఏడుగురి గాయాలయ్యాయి. జగర్‌గుండా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని టేకులగూడెం వద్ద ఈ ఘటన చోటుచేసుకొన్నది. మృతిచెందిన జవాన్లు విష్ణు, శైలేందర్‌ అని పోలీసులు తెలిపారు. మరోవైపు, మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న మోస్ట్‌ వాంటెడ్‌ నాయకుడు గిరిధర్‌ తుమ్రెట్టి అలియాస్‌ బిచ్చు తన భార్య సంగీత అలియాస్‌ లలితతో కలిసి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌, పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో లొంగిపోయారు.

Tags

Next Story