Karnataka: 30 ఏళ్ళ క్రితం మరణించిన మా కుమార్తెకు వరుడు కావలెను ..

వరుడి కోసం తల్లిదండ్రుల పత్రికా ప్రకటన

పెళ్లి సంబంధాల కోసం వార్తా పత్రికల్లో ప్రకటనలు ఇవ్వటం సాధారణం.. అయితే కర్ణాటకలోని పుత్తూరులో ఓ కుటుంబ పెద్దలు ఇచ్చిన పత్రికా ప్రకటన ఆసక్తికరంగా ఉంది. 30 ఏండ్ల క్రితం మరణించిన తమ కుమార్తెకు తగిన ప్రేతాత్మ వరుడు కావాలని ఈ ప్రకటనలో కోరారు. “కులల్‌ కులం, బంగే రా గోత్రంలో జన్మించిన వధువుకు తగిన వరుడు కావలెను. వధువు 30 ఏండ్ల క్రితం మరణించింది. ఇదే కులం, వేరొక గోత్రంలో జన్మించిన, 30 సంవత్సరాల క్రితం మరణించిన వరుడు ఉన్నట్లయితే, ప్రేత మడువే కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆయన కుటుంబ సభ్యులు సమ్మతిస్తే సంప్రదించండి” అని ఈ ప్రకటనలో తెలిపారు.

సంప్రదించవలసిన ఫోన్‌ నంబరును కూడా ఇచ్చారు. ఈ ప్రకటనపై దాదాపు 50 మంది స్పందించారని వధువు కుటుంబ పెద్ద ఒకరు చెప్పారు. ప్రేత మడువే కార్యక్రమాన్ని నిర్వహించే తేదీని త్వరలోనే నిర్ణయిస్తామన్నారు. దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లోని తులునాడు ప్రాంతంలో మరణించినవారి ఆత్మలకు వివాహం చేసే ఆచారం ఉంది. జీవించి ఉన్నవారికి పెండ్లి చేసినట్లుగానే ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు.

Tags

Next Story