Delhi: ఢిల్లీలో ఘోర విషాదం.. రూమ్ హీటర్ పేలి కుటుంబం దుర్మరణం

Delhi: ఢిల్లీలో ఘోర విషాదం.. రూమ్ హీటర్ పేలి కుటుంబం దుర్మరణం
X
నిద్రలోనే ముగ్గురు శాశ్వత నిద్రలోకి

గత కొద్దిరోజులుగా దేశ రాజధాని ఢిల్లీని చలిగాలులు పట్టిపీడిస్తున్నాయి. రోజురోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తాజాగా 3 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. దీంతో ప్రజలు చలి నుంచి రక్షణ కోసం రూమ్ హీటర్లను ఉపయోగిస్తున్నారు. అయితే కొన్ని సార్లు ఇవి ప్రాణాల మీదకు తెస్తుంటాయి. తాజాగా రూమ్ హీటర్ పేలి కుటుంబ సభ్యులు విగతజీవులుగా మారిపోయారు. ఈ విషాద ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.

ఢిల్లీ మెట్రోలో ఇంజనీర్‌గా పని చేస్తున్న కుటుంబం DMRC సిబ్బంది క్వార్టర్స్‌లో నివాసం ఉంటోంది. చలి నుంచి రక్షణ పొందేందుకు రూమ్ హీటర్ ఆన్ చేసి నిద్రపోయారు. అయితే సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో హీటర్ పేలి పోయింది. దీంతో రూమ్‌లోంచి పొగలు బయటకు వచ్చాయి. ఇరుగు పొరుగు వారు వెళ్లి చూడగా.. భర్త, భార్య, కుమార్తె చనిపోయి ఉన్నారు. నిద్రలోనే ముగ్గురు కూడా శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు.

వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా భావించారు. రూమ్ హీటర్స్ ఉపయోగించే విషయంలో ముఖ్యమైన భద్రతా సమాచారాన్ని పాటించాలని పోలీసులు తెలిపారు.

Tags

Next Story