MP: ఫేస్‌బుక్‌లో పరిచయమైన అమ్మాయి కోసం 100 కి.మీ. ప్రయాణం

తెలిసీతెలియని వయసులో యువతీయువకులు ఏం చేస్తుంటారో వారికే అర్థం కాదు. వ్యామోహాన్నే ప్రేమ అనుకుని దారి తప్పుతుంటారు. సోషల్ మీడియాలో పరిచయం అయిన ఒక అమ్మాయి కోసం 100 కి.మీ ప్రయాణం చేశాడు. చివరికి అమ్మాయి కుటుంబ సభ్యుల చేతిలో చిక్కుకుని 13 గంటలు నరకం అనుభవించాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాకు చెందిన ఒక యువకుడికి ఫేస్‌బుక్‌లో ఒక అమ్మాయి స్నేహితురాలిగా మారింది. దీంతో శనివారం ఆమెను కలిసేందుకు 100 కి.మీ ప్రయాణం చేసి మౌగంజ్‌లోని పిప్రాహి గ్రామానికి చేరుకున్నాడు. అమ్మాయిను కలవకముందే కుటుంబ సభ్యులకు చిక్కాడు. అంతే యువకుడి చేతులు, కాళ్లను తాడుతో కట్టేసి చితకబాదారు. శనివారం రాత్రి 9 గంటలకు మొదలు పెట్టి.. ఆదివారం ఉదయం 10 గంటల వరకు కొడుతూనే ఉన్నారు. ఇలా ఏకధాటిగా 13 గంటలు కొడుతూనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
యువకుడిపై దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. ఫేస్‌బుక్‌లో మైనర్ అమ్మాయితో బైకుంత్పూర్‌కు చెందిన యువకుడితో పరిచయం ఏర్పడిందని.. ఆమెను కలిసేందుకు 100 కి.మీ ప్రయాణం చేసి వచ్చినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు పట్టుకుని 13 గంటల పాటు కొట్టారని పేర్కొన్నారు. దీనిపై ఇంకా అధికారికంగా ఎవరూ ఫిర్యాదు చేయలేదని హనుమాన పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ తెలిపారు. అయినా కూడా పూర్తి సమాచారం సేకరించి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com