UP: ఒకే కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పద మృతి..ఎక్కడంటే

UP:  ఒకే కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పద మృతి..ఎక్కడంటే
X
3 తుపాకీలు స్వాధీనం.. సీసీకెమెరాలు పరిశీలన

ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో ఘోరం జరిగింది. ఒకే కుటంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సహరాన్‌పూర్‌లో మృతదేహాల కలకలం రేగడంతో పోలీసులు సమాచారం అందుకుని మృతదేహాలను పరిశీలించారు. అయితే మృతదేహాల నుదిటిపై తూటాల గుర్తులు కనిపించాయి. అంతేకాకుండా సంఘటనాస్థలిలో 3 తుపాకులను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో కుటుంబ యజమాని అశోక్ ఆత్మహత్యకు ముందు కుటుంబ సభ్యుల్ని కాల్చి చంపి.. అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తు్న్నారు. అప్పులు లేదా కుటుంబ సమస్యల కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అశోక్ మొదట తల్లి విద్యావతిని.. అనంతరం భార్య అంజితను, అటు తర్వాత ఇద్దరు కుమారులైన కార్తీక్, దేవ్‌ను కాల్చి చంపినట్లుగా భావిస్తున్నారు. అశోక్, భార్య అంజిత మృతదేహాలు నేలపై ఉండగా.. మిగతా ముగ్గురు మృతదేహాలు మంచంపై పడి ఉన్నాయి. అంటే నిద్రలో ఉండగా ఈ ఘతుకానికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. దేవ్ పట్టణంలో 9వ తరగతి చదువుతుండగా.. కార్తీక్ 10వ తరగతి చదువుతున్నాడు. అయితే కుటుంబానికి ఎవరితోనూ విభేదాలు లేవని.. ప్రశాంతంగా ఉంటారని స్థానికులు చెబుతున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి.. ఎవరైనా వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం సీసీకెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇంటిని సీజ్ చేసి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Tags

Next Story