National: పాట్నా ఆయిల్ గోదాంలో అగ్నిప్రమాదం

National: పాట్నా ఆయిల్ గోదాంలో అగ్నిప్రమాదం
యిల్ తయారు చేసే గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు పెద్దఎత్తున ఎగిసిపడి పొగలు వ్యాపించాయి

బిహార్ రాజధాని పాట్నాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆయిల్ తయారు చేసే గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు పెద్దఎత్తున ఎగిసిపడి పొగలు వ్యాపించాయి. దట్టమై పొగలు చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేయడంతో పాటు భారీగా మంటలు చెలరేగడంతో స్థానిక ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. అయితే అగ్నిప్రమాదం జరిగిన సమయంలో గోదాంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదాల్లో భారీగా ఆస్తి నష్టం జరిగిందని స్థానికులు తెలిపారు.

స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి వెంటనే సమాచారం అందించారు. దాంతో ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. దాంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story