ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో అగ్ని ప్రమాదం

ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో అగ్ని ప్రమాదం
ఉజ్జయినిలో భస్మ హారతి సందర్భంగా మహాకాల్ ఆలయంలోని 'గర్భగృహ'లో మంటలు చెలరేగడంతో 13 మంది గాయపడ్డారు.

మార్చి 25, సోమవారం ఉజ్జయినిలో భస్మ హారతి సందర్భంగా మహాకాల్ ఆలయంలోని 'గర్భగృహ'లో మంటలు చెలరేగడంతో 13 మంది గాయపడ్డారు. ఈ సంఘటన ఉదయం 5.50 గంటలకు చోటు చేసుకుంది. మరి కొద్ది సేపట్లో 'భస్మ హారతి' ముగియనుంది. సరిగ్గా అదే సమయంలో మంటలు అంటుకున్నాయి. హోలీ వేడుకల మధ్య 'కపూర్ ఆరతి' ప్రారంభించాలనుకున్నారు ఆలయ పూజారులు. కానీ అంతలోనే ఈ పరిణామం తలెత్తింది.

13 మంది క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఎనిమిది మందిని ఇండోర్‌కు తరలించారు. ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించాం’ అని జిల్లా కలెక్టర్ నీరజ్ కుమార్ సింగ్ తెలిపారు.

ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయంలో అగ్నిప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్‌తో సంభాషించారు. X పోస్ట్‌లో, షా "నేను CM మోహన్ యాదవ్‌తో మాట్లాడాను. అగ్ని ప్రమాదం గురించి సమాచారాన్ని సేకరించాను. స్థానిక పరిపాలన గాయపడిన వారికి అన్ని సహాయ సహకారాలు అందిస్తుంది. వారికి అవసరమైన చికిత్సను అందిస్తుంది అని పేర్కొన్నారు.

దీనిని "దురదృష్టకర" సంఘటనగా పేర్కొంటూ, ముఖ్యమంత్రి ఉదయం నుండి అధికారులతో టచ్‌లో ఉన్నారు. గాయపడిన ప్రతి వ్యక్తి త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. “భస్మ హారతి సమయంలో మహాకాల్ ఆలయంలోని 'గర్భగృహ'లో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరం. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని బాబా మహాకాల్‌ని ప్రార్థిస్తున్నాను" అని యాదవ్ మైక్రోబ్లాగింగ్ సైట్‌లో రాశారు.

మతపరమైన వేడుకలో భాగంగా 'గులాల్' (హోలీ సమయంలో ఉపయోగించే రంగు పొడి) విసురుతుండగా మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.


Tags

Read MoreRead Less
Next Story