Bangalore: ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌లో మంటలు.. యువతి సజీవదహనం...

కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాజ్‌కుమార్ రోడ్డులోని ఈవీ స్కూటర్ షోరూమ్‌లో మంటలు చెలరేగాయి. షోరూంలో పార్క్ చేసిన వాహనాలన్నీ దగ్ధమైనట్లు సమాచారం. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే, అగ్నిమాపక దళం యొక్క అనేక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. అయితే మంటలు ఆర్పే సమయానికి నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ కూడా మృతి చెందింది.
మంగళవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో షోరూంలో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలను కాపాడుకోవడానికి అందరూ పరుగెత్తడం ప్రారంభించారు. షోరూమ్ నుంచి ఎలాగోలా బయటకు వచ్చి ప్రాణాలను కాపాడుకున్నారు. అయితే షోరూమ్‌లో పనిచేస్తున్న ఒక సేల్స్ గర్ల్ లోపల చిక్కుకుంది. ఈ ఘటనపై ప్రజలు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడం ప్రారంభించారు. చాలా గంటలపాటు శ్రమించి అగ్నిమాపక శాఖ మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికి అంతా కాలి బూడిదైంది. లోపల ఇరుక్కుపోయిన సేల్స్ గర్ల్ ప్రియ (20) కూడా సజీవ దహనమై దుర్మరణం చెందింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని చెబుతున్నారు. ఈ మొత్తం ప్రమాదంలో షోరూం యజమానికి లక్షల రూపాయల నష్టం వాటిల్లింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com