Fire In Vande Bharat Train : భారత్ రైల్లో మంటలు

Fire In Vande Bharat Train : భారత్ రైల్లో మంటలు
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

వందేభారత్‌ రైలుకు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. వందేభారత్ రైల్లో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మధ్యప్రదేశ్ కుర్వాయి కేథోరా రైల్వే స్టేషన్‌లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. భోపాల్‌లోని రాణికమలాపాటి స్టేషన్‌ నుంచి బయలుదేరిన వందేభారత్ రైలు.. కుర్వాయి స్టేషన్‌ వద్దకు చేరుకోగానే సీ-14 కోచ్‌ వద్ద మంటలు చెలరేగాయి. కుర్వాయి స్టేషన్ వద్దకు రాగానే బ్యాటరీ నుంచి మంటలు గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే సమాచారాన్ని లోకో పైలట్‌కు అందించారు. దీంతో రైలును అక్కడే నిలిపివేశారు. ఈ క్రమంలో అగ్నిమాపక దళం అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అర్పివేశారు. బ్యాటరీ బాక్స్‌లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులంతా ఆందోళనకు గురయ్యారు. హుటాహుటిన ట్రైన్ నుంచి దిగిపోయారు. వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో ప్రయాణికులు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని.. ఎలాంటి గాయాలు కాలేదని ఇండియన్ రైల్వే ప్రకటించింది.



రాణి కమలాపతి - హజ్రత్‌ నిజాముద్దీన్‌ వందే భారత్‌ రైలు సోమవారం తెల్లవారుజామున 5.40 గంటల ప్రాంతంలో భోపాల్‌ నుంచి బయల్దేరింది. ఉదయం 6.45 గంటల ప్రాంతంలో సీ-12 బోగీ చక్రాల్లో నుంచి పొగలు రావడాన్ని రైల్వే సిబ్బంది గుర్తించారు. వెంటనే రైలును విదిశ జిల్లాలోని కుర్వాయ్‌ - కేథోరా స్టేషన్ల మధ్య నిలిపివేసి తనిఖీ చేయగా.. బ్యాటరీ బాక్సుల్లో మంటలు (Fire in Battery Box) చెలరేగినట్లు తెలిసింది. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే ప్రయాణికులను దించేశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

మంటలు బ్యాటరీ బాక్స్‌కు మాత్రమే పరిమితమయ్యాయని.. వాటిని పూర్తిగా అదుపు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రైల్వే సిబ్బంది రైలుకు మరమ్మతులు చేస్తున్నారని పేర్కొన్నారు. సాంకేతిక తనిఖీలు పూర్తి చేసిన అనంతరం రైలు దిల్లీ బయల్దేరుతుందని చెప్పారు. ఘటన సమయంలో సీ-12 బోగీలో 36 మంది ప్రయాణికులున్నారు. మధ్యప్రదేశ్‌లో అందుబాటులోకి వచ్చిన మొదటి వందే భారత్‌ రైలు (Vande Bharat Express) ఇదే. ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీన్ని ప్రారంభించారు.

Tags

Next Story