తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి
తమిళనాడులో ఘోర ప్రమాదం.. విషాదం నింపింది. విరుదునగర్‌ జిల్లా ఎరిచ్చనత్తం ప్రాంతంలోని బాణసంచా కర్మాగారంలో పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి..

తమిళనాడులో ఘోర ప్రమాదం.. విషాదం నింపింది. విరుదునగర్‌ జిల్లా ఎరిచ్చనత్తం ప్రాంతంలోని బాణసంచా కర్మాగారంలో పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు.

దీపావళి పండగ సమీపిస్తున్న వేళ వివిధ రకాల బాణాసంచా తయారీలో దాదాపు 50 మంది కార్మికులు నిమగ్నమై ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. బాణసంచా తయారీకి ఉపయోగించే రసాయనాల్లో ఘర్షణ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సమాచారం అందుకున్న వెంటనే నాలుగు అగ్నిమాపక యంత్రాలు అక్కడి చేరుకున్నాయి. రెండు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

Tags

Next Story