Tragedy: బాణసంచా పేలుడు. ఐదుగురు కుటుంబ సభ్యులు మృతి.

Tragedy: బాణసంచా పేలుడు. ఐదుగురు  కుటుంబ సభ్యులు మృతి.
X
ఛత్తీస్‌ఘడ్‌లో తీవ్ర విషాదం

ఛత్తీస్‌ఘడ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బలరాంపూర్ జిల్లాలోని గోదర్‌మాన గ్రామంలో ఓ ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం బాణసంచా పేలి ఐదుగురు చనిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. హోలీ పండగ కోసమని పటాకులు అమ్మేందుకు కిరాణ వ్యాపారి కుష్ గుప్తా (45) సిద్ధం చేసుకున్నాడు. ఈ క్రమంలో భారీగా పటాకులు అమ్మకానికి తీసుకురాగా.. వాటిని కిరాణం షాపు బయట ఎండలో పెట్టాడు. అయితే ఎండ వేడికి పటాకులు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో.. ఆ ప్రాంతమంతా భారీగా పొగలతో కమ్ముకుపోయింది. అంతేకాకుండా.. పేలుడు శబ్దం భారీగా రావడంతో ఆ ప్రాంతవాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.

కాగా.. పొగ భారీగా కమ్ముకోవడంతో కుష్ గుప్తా తన కిరాణా దుకాణంలోకి వెళ్లాడు. ఆ తర్వాత.. అతని భార్య, పిల్లలు వెళ్లారు. అయితే పొగ వస్తుందని షాపు షట్టర్‌ను కిందకు దించాడు. ఈ క్రమంలో.. పొగ, గ్యాస్ షాపులోకి ప్రవేశించి ఊపిరాడక చేసింది. కాగా.. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. షాపులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు వెనుక గోడ భాగాన్ని కట్ చేశారు. అనంతరం పోలీసులు లోపలికి చేరుకునేసరికి కుటుంబమంతా అపస్మారక స్థితిలో పడి ఉన్నారు.

ఈ క్రమంలో వెంటనే ఐదుగురినీ రామానుజ్‌గంజ్‌లోని 100 పడకల ఆసుపత్రికి తరలించారు. అక్కడ అందరూ చనిపోయారని వైద్యులు ప్రకటించారు. ఊపిరాడకపోవడం వల్లే మరించారని డాక్టర్లు నిర్ధారించారు. మృతుల్లో ఒక చిన్నారి, మహిళ కూడా ఉన్నారు. అనంతరం పోస్ట్‌మార్టం చేసి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Tags

Next Story