తొలిదశ ఓటింగ్ ప్రశాంతం

62.37% పోలింగ్ నమోదు

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. వేసవి దృష్ట్యా ఉదయమే ఓటర్లు పెద్దసంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. తొలిదశలో 102 స్థానాల్లో ఓటింగ్‌ జరగ్గా, 1625 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. 62.37 శాతం ఓట్లు పోలయ్యాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. మొదటి దశ పోలింగ్​లో బంగాల్​లో అత్యధిక ఓటింగ్​ శాతం నమోదైనట్లు తెలుస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు 77.57శాతం ఆ రాష్ట్రంలో ఓటింగ్ నమోదైంది.

మొదటి దశ పోలింగ్‌లో పలు ప్రాంతాల్లో నవ దంపతులు తమ ఓటు హక్కును వినియెగించుకున్నారు. జమ్ముకశ్మీర్‌ ఉధంపుర్‌లో నవ వధూవరులు ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. పెళ్లి వస్త్రాల్లోనే ఓటు వేసేందుకు వారు పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. గురువారం తమకు వివాహం జరిగిందన్న పెళ్లి కూతురు, తమ ఓట్లను వృథా చేయకూడదన్న ఉద్దేశంతో భర్తతో కలిసి ఓటు వేసినట్లు చెప్పారు. రాజస్థాన్‌ జయపురలో గురువారం రాత్రి వివాహం జరిగిన నవ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వివాహ క్రతువులో భాగమైన వీడ్కోలు కార్యక్రమం ముందు మోహన్‌పురాలోని పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేసినట్లు పెళ్లికూతురు తెలిపింది.

తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో 102 ఏళ్ల వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా గుర్తింపు తెచ్చుకున్న జ్యోతి ఆమ్గే మహారాష్ట్ర నాగపుర్‌లో ఓటు వేశారు. కుటుంబ సమేతంగా పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన జ్యోతి, అందరితోపాటు క్యూలైన్‌లో నిల్చుని ఓటు వేశారు. అనంతరం ప్రతి ఒక్కరు ఓటు వేయాలని, దేశ పౌరులుగా ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యతని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story