Air Show: చెన్నై ఎయిర్‌ షోలో విషాదం..

Air Show:  చెన్నై ఎయిర్‌ షోలో విషాదం..
X
ఐదుకు చేరిన మృతుల సంఖ్య..

చెన్నైలోని మెరీనా బీచ్‌ దగ్గర ఎయిర్‌ షో తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఎయిర్‌ షో చూసేందుకు జనం పోటెత్తారు. దీంతో.. మెరీనా బీచ్ మొత్తం జనసంద్రంగా మారింది. బీచ్ కు వచ్చే రోడ్లు, మెట్రో రైళ్లు కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలోనే మెరీనా బీచ్ రైల్వే స్టేషన్ దగ్గర జరిగింది. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. డీహైడ్రేషన్ కారణంగా దాదాపు 265 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వేడి వాతావరణం కారణంగా కొంతమంది అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులను శ్రీనివాసన్ (48), కార్తికేయన్ (34), జాన్ బాబు (56), దినేష్‌గా గుర్తించారు. IAF తన 92వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. 15 లక్షల మందికి పైగా ప్రజలు రైలు, మెట్రో, కార్లు మరియు బస్సుల ద్వారా వేదిక వద్దకు చేరుకుని ప్రదర్శనను వీక్షించారు. సాయంత్రం 4.30 గంటల వరకు దాదాపు మూడు లక్షల మంది పైగా లోకల్ ట్రైన్స్ లో ప్రయాణించనట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

అస్తవ్యస్త ఏర్పాట్లపై విమర్శలు

పోలీసుల వైఫల్యం వల్ల నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌జామ్‌లు ఏర్పడ్డాయి. కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లే క్రమంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రయాణికులతో రైల్వే స్టేషన్‌ కిక్కిరిసిపోయింది. చాలా మంది వృద్ధులు, మధ్య వయస్కులు ప్రదర్శన ప్రారంభం కాకముందే స్పృహతప్పి పడిపోవడం కన్పించింది. దీనికి తోడు మంచినీటిని అమ్మేవారిని అక్కడి నుంచి తొలగించడంతో ప్రజలు దాహంతో అల్లాడారు. తీవ్ర ఎండకు తాళలేక పలువురు రోడ్డు పక్కన కూలబడిపోవడం కన్పించింది. కనీసం ప్రజలకు తాగునీరు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఎందుకు ఉండాలి.. చనిపోయిన కుటుంబాలకు ఏఐడీఎంకే అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. స్థానిక నివాసితులు వచ్చి వీరికి మంచినీరు అందించడంతో తేరుకున్నారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టిన నిర్వాహకులు కనీస ఏర్పాట్లు, అవసరాలను విస్మరించారని పలువురు మండిపడ్డారు.

ఎయిర్ షో ఘటనలో ఐదుగురు మృతి చెందడంపై మాజీ ముఖ్యమంత్రి పళణి స్వామి తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఐదు మంది చనిపోయారని అన్నారు. కనీస భద్రత ఏర్పాట్లు చేయకుండా అన్ని లక్షల మందిని ఎయిర్ షోకు అనుమతించారు.

Tags

Next Story