Uttarakhand tunnel : సొరంగం వద్ద శరవేగంగా రెస్క్యూ

ఉత్తరాఖండ్ లోని సిల్ క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యల్లో కీలక ముందడుగు పడింది. కార్మికులను చేరుకునేందుకు చేపట్టిన తవ్వకాల పనులు ఇప్పటి వరకు 52 మీటర్ల మేర పూర్తయ్యాయని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ వెల్లడించారు. మరో 5 మీటర్ల మేర పనులు పూర్తయితే కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావచ్చని చెప్పారు. సహాయక చర్యల్ని ఆయన దగ్గరుండి పరిశీలిస్తున్నారు. నేలకు సమాంతరంగా తొలుత చేపట్టిన పనులు ఆగిపోయిన చోట 12 మంది ర్యాట్ హోల్ మైనర్లు తవ్వకాలు చేపట్టారు. వారు శరవేగంగా పనులు కొనసాగిస్తున్నారు. ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకపోతే ఇవాళ సాయంత్రానికి రెస్క్యూ పనులు కీలక దశకు చేరుకునే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు కొండ పైభాగం నుంచి చేపట్టిన వర్టికల్ డ్రిల్లింగ్ పనులు ఇప్పటికే 42 మీటర్లు పూర్తయ్యాయి. నిట్టనిలువుగా 86 మీటర్లుండగా.. ఇందులో దాదాపు సగం పని పూర్తయినట్లు సహాయక సిబ్బంది తెలిపారు.
ఓవైపు సొరంగంపైన ఉన్న కొండను తొలుస్తూ.. మరోవైపు సొరంగం లోపల ఉన్న శిథిలాల తొలగింపు ముమ్మరం చేస్తూ.. ఇంకోవైపు నుంచి కూడా తవ్వకం చేపడుతూ కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది స్థైర్యం సడలకుండా ధైర్యం చెబుతున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తర కాశీ జిల్లా సిల్క్యారా వద్ద సొరంగంపైన ఉన్న కొండపై సోమవారం నాటికి 36 మీటర్ల మేర డ్రిల్లింగ్ చేశారు. టన్నెల్ పైభాగాన్ని చేరాలంటే ఇంకా 55 మీటర్ల మేర తవ్వాల్సి ఉంది. కూలీలను బయటకు తెచ్చేందుకు 1.2 మీటర్ల వ్యాసం ఉన్న పైప్‌లను నిలువునా వేయాల్సి ఉంటుంది. సైన్యంలో ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా పని చేసిన లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ ఈ రెస్య్కూ ఆపరేషన్‌లో పాల్పంచుకుంటున్నారు. అలాగే ప్రధాని కార్యాలయ సలహాదారు, ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ PK మిశ్రా సిల్క్‌యారా ఉత్తరకాశీలోని సిల్క్‌యారా టన్నెల్‌లోకి వెళ్లారు. లోపల చిక్కుకున్న కార్మికులతో మాట్లాడారు. అలాగే వారి కుటుంబ సభ్యులతోనూ మాట్లాడారు.
కేవలం 5 మీటర్ల మేర తవ్వితే కార్మికులను చేరుకోవచ్చని, ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుంటే మంగళవారం సాయంత్రానికి రెస్క్యూ పనులు కీలక దశకు చేరుకుని ‘శుభవార్త’ వినే అవకాశం ఉందని చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్‌కు సురక్షిత మార్గాన్ని సృష్టించేందుకు శిథిలాలను తొలగిస్తున్నామని చెప్పారు.
దీంతో మ్యానువల్ డ్రిల్లింగ్ చేపట్టి యంత్రాన్ని దాని నుంచి తొలగించారు. ఆ తర్వాత ‘ర్యాట్ హోల్ మైనర్లు’ సోమవారం రాత్రి నుంచి తవ్వకాలు ప్రారంభించారు. సమాంతరంగా తవ్వకం పూర్తయిన తర్వాత 800 మి.మీ. వ్యాసం ఉన్న పైపులను సొరంగంలోకి ప్రవేశపెడతామని అధికారులు తెలిపారు. మరోవైపు, కొండ పైభాగం నుంచి చేపట్టిన డ్రిల్లింగ్ పనులు ఇప్పటికే 42 మీటర్లు పూర్తయ్యాయి. నిట్టనిలువుగా 86 మీటర్లుండగా.. ఇందులో దాదాపు సగం తవ్వకం పూర్తయినట్టు పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com