Results: మొదలైన కౌంటింగ్.. గెలిచేది ఎవరు?

Results: మొదలైన కౌంటింగ్.. గెలిచేది ఎవరు?
ముందుగా పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్ల లెక్కింపు..

మధ్యప్రదేశ్ , ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ శాసనసభల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కాగా మొదటి పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కిస్తున్నారు. గతనెల 30న వెలువడిన ఎగ్జిట్ పోల్స్.... రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి మెజార్టీ వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనాలు వెలువరించాయి. కానీ ఆ రెండు రాష్ట్రాల్లో తామే గెలుస్తామనే ధీమాతో హస్తం నేతలు ఉన్నారు.

230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో భాజపా, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. 116 సీట్లు గెలిచిన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. 2018ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 116స్థానాలు, భాజపా 109 సీట్లు గెలుపొందాయి. కమల‌్ నాథ్‌ సారథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ దాదాపు ఏడాదిన్నర తర్వాత జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు తిరగుబాటు చేయటంతో ప్రభుత్వం పడిపోయింది. శివరాజ్‌సింగ్‌ సారథ్యంలో మళ్లీ భాజపా ప్రభుత్వం ఏర్పాటైంది.

రాజస్థాన్‌లోనూ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు భాజపాకు అనుకూలంగా వెలువడటంతోపాటు ఐదేళ్లకోసారి అధికార మార్పిడి జరగటం గతకొన్ని దశాబ్దాల నుంచి సంప్రదాయంగా వస్తోంది. సానుకూల అంశాల నేపథ్యంలో కమలనాథులు తమదే అధికారమన్న గట్టి ధీమాతో ఉన్నారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమను వరుసగా రెండోసారి గెలిపిస్తాయని, ఐదేళ్లకోసారి అధికారం మారే దశాబ్దాలనాటి సంప్రదాయాన్ని తిరగరాస్తామని హస్తం నేతలు విశ్వాసంతో ఉన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వంద స్థానాల్లో, భాజపా 27 సీట్లు గెలుపొందాయి. బీఎస్పీ, స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నూటా ఒక్క స్థానాలు సాధించిన పార్టీ అధికారం చేపట్టనుంది.

ఛత్తీస్ గఢ్ లో 90 స్థానాలు ఉండగా రెండోసారి కూడా తమదే అధికారమని కాంగ్రెస్‌ నేతలు ధీమాతో ఉన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు కూడా ఆ పార్టీకే అనుకూలంగా వెల్లవడ్డాయి. 46 సీట్ల మెజారిటీ మార్కును అందుకునే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది

Tags

Read MoreRead Less
Next Story