Delhi: ఢిల్లీలో దుమ్ము తుఫాను బీభత్సం, విమాన రాక‌పోక‌ల‌కు అంత‌రాయం

Delhi: ఢిల్లీలో దుమ్ము తుఫాను బీభత్సం, విమాన రాక‌పోక‌ల‌కు అంత‌రాయం
X
205 ఫ్లైట్స్ బంద్..

దేశ రాజధాని ఢిల్లీని దుమ్ము తుఫాన్ బెంబేలెత్తించింది. శుక్రవారం ఊహించని రీతిలో ఈదురుగాలులు హడలెత్తించాయి. దీంతో చెట్లు నేలకూలాయి. శుక్రవారం సాయంత్రం మొదలైన దుమ్ము తుఫాన్ అర్ధరాత్రి వరకు బీభత్సం సృష్టించింది. దీంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 205 విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఎయిర్‌పోర్టులోనే ప్రయాణికులు దిగ్బంధం అయిపోయారు. గంటల తరబడి విమానాశ్రయలోనే నిరీక్షిస్తున్నారు. అయితే త్వరలోనే సేవలను పునరుద్ధరిస్తామని ఎయిర్‌పోర్టు సిబ్బంది చెప్పుకొస్తున్నారు.

దుమ్ము తుఫాన్ కారణంగా అనేక విమానాలను దారి మళ్లించి రద్దు చేశారు. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయని అధికారి తెలిపారు. దారి మళ్లించిన విమానాలు తిరిగి ఢిల్లీ ఎయిర్‌పోర్టు రావడానికి చాలా సమయం పట్టిందని.. దీంతో విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ పెరిగిందని అధికారి పేర్కొన్నారు. సేవలను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు.

ఇప్పటికే ఆయా విమాన సంస్థలు ప్రయాణికులను అలర్ట్ చేసింది. అయినా కూడా ప్రయాణికులు తమ కష్టాలను, ఇబ్బందులను ఎక్స్ వేదికగా వ్యక్తం చేస్తున్నారు. కనెక్టింగ్ ఫ్లైట్ ఉన్న వారంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది తీవ్రంగా మండిపడుతున్నారు. 205 ఫ్లైట్స్ బంద్..

ఇదిలా ఉంటే ఈరోజు కూడా ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం విమాన రాకపోకలు తిరిగి నెమ్మది నెమ్మదిగా పునరుద్ధరించబడుతున్నాయని వర్గాలు పేర్కొంటున్నాయి.

Tags

Next Story