Assam Floods : మళ్లీ వరదలు…15 మంది మృతి

Assam Floods : మళ్లీ వరదలు…15 మంది మృతి
X

అసోంను మరోసారి వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. వరదల పరిస్థితి సోమవారం భయానకంగా మారిందనీ, వరదల కారణంగా 1.90 లక్షల మందికి పైగా ప్రభావితమయ్యారనీ, ఒకరు మరణించారని అధికారిక బులెటిన్ లో పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చాలా నదుల నీటి మట్టాలు పెరిగాయనీ, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పలు నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయని తెలిపారు. నీటి మట్టాలు పెరగడంతో గౌహతిలో బ్రహ్మపుత్ర నదిపై, జోర్హాట్ లోని నేమాటిఘాట్ వద్ద ఫెర్రీ సేవలను నిలిపివేశారు.

అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో మళ్లీ వరదలు వెల్లువెత్తాయి. అసోంలోని నదులు వరదనీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. పెరుగుతున్న నీటిమట్టాల కారణంగా బ్రహ్మపుత్ర నదిలో ఫెర్రీ సేవలు నిలిపివేశారు. రోడ్లు, వంతెనలు, విద్యుత్ స్తంభాలు, పాఠశాలలు వరదల వల్ల దెబ్బతిన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్న నదుల నీటి మట్టాలు పెరిగాయి. ఈ సంవత్సరం వరదల వల్ల మృతి చెందినవారి సంఖ్య 15కు చేరిందని అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఏఎస్డీఎంఏ) తెలిపింది. 17 జిల్లాల్లోని 2 లక్షల మంది వరదల బారిన పడ్డారు. లఖింపూర్, ధేమాజీ జిల్లాలు వరదలతో అతలాకుతలం అయ్యాయి. మొత్తం 427 మంది రెండు సహాయ శిబిరాల్లో తలదాచుకున్నారు. మరో 45 ఆహార పంపిణీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. బెకి, జియా-భరాలీ, దిసాంగ్, డిఖౌ, సుబన్‌సిరి నదులు రెడ్ మార్క్ ను అధిగమించి ప్రవహిస్తున్నాయి.


ప్రస్తుతం 8,086.40 హెక్టార్ల పంట భూములు వరదనీటిలో మునిగాయి. 81,340 జంతువులు,11,886 కోళ్లతో సహా 1,30,514 జంతువులు వరదల బారిన పడ్డాయని అధికారులు చెప్పారు. ఉదల్‌గురిలోని రెండు ప్రాంతాలు, బిస్వనాథ్, దర్రాంగ్‌లలో ఒక్కొక్కటి వరదనీటితో కట్టలు తెగిపోయాయి. బార్‌పేట, బిస్వనాథ్, ధుబ్రి, లఖింపూర్, మోరిగావ్, నల్బరి, శివసాగర్, సోనిత్‌పూర్, టిన్‌సుకియా, ఉడల్‌గురిలలో కోతలు నమోదైయ్యాయి. వరదల్లో రోడ్లు, వంతెనలు, విద్యుత్ స్తంభాలు, పాఠశాలలు కూడా దెబ్బతిన్నాయి. వివిధ ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక యంత్రాంగం, ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు చేపడుతున్నాయని ఏఎస్డీఎంఏ తెలిపింది.

Tags

Next Story