బిహార్‌ ఎన్నికల్లో​ పోటీ చేస్తా : మాజీ డీజీపీ

బిహార్‌ ఎన్నికల్లో​ పోటీ చేస్తా : మాజీ డీజీపీ

మంగళవారం బీహార్ డీజీపీ పదవికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన గుప్తేశ్వర్ పాండే.. త్వరలో రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఏ పార్టీలో చేరేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. పార్ల‌మెంట్‌లో నేరస్థులు అడుగుపెడుతున్నారు. అలాంటప్పుడు ప్రభుత్వ అధికారిగా పనిచేసిన తానేందుకు రాజ‌కీయాల్లో రావొద్దని ప్ర‌శ్నించారు పాండే. రాజకీయాల్లోకి రావడం ఏమైనా అనైతిక చర్యనా.. పోలీసులు రాజకీయాల్లోకి రాకూడదనే నిబంధన ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. కాగా పాండే బీహార్ లో అధికార జేడీయూ లేదా బీజేపీలో చేరాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Tags

Next Story