బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ కన్నుమూత..

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ (80) గురువారం ఉదయం కోల్‌కతాలోని తన స్వగృహంలో కన్నుమూశారు.

బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మరియు ప్రముఖ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు బుద్ధదేవ్ భట్టాచార్జీ (80) మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు గురువారం ధృవీకరించారు. కోల్‌కతాలోని బాలిగంజ్‌లోని తన నివాసంలో ఉదయం 8.20 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య మీరా, కుమార్తె సుచేతన ఉన్నారు.

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ సలీం ఈ వార్తను ధృవీకరించారు. బుద్ధదేవ్ భట్టాచార్జీ ఆకస్మిక మరణ వార్తతో తాను చాలా బాధపడ్డానని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఆయన నాకు తెలుసు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. చాలా సార్లు ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించాను. ఆయన సతీమణి మీరాడికి, కుమార్తె సుచేతన్‌కు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని మమత తెలిపారు.





Tags

Next Story