West Bengal: గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి

West Bengal: గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి
X
మృతుల్లో ముగ్గురు చిన్నారులు.. మరికొందరికి గాయాలు

పశ్చిమ బెంగాల్‌ దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండ్‌ పేలడంతో నలుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మృతి చెందారని సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు. పథార్‌ప్రతిమ బ్లాక్లోని ధోలాహత్‌ గ్రామంలో సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పేలుడు చోటు చేసుకుందని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు.

మృతదేహాలను ఇంట్లో నుంచి వెలికి తీశామని.. గాయపడిన ఓ మహిళలను రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు సుందర్‌బన్‌ ఎస్పీ కోటేశ్వరరావు తెలిపారు. మృతులంతా ఒకేకుటుంబానికి చెందిన వారని పేర్కొన్నారు. ఇంట్లో రెండు గ్యాస్‌ సిలిండర్లు ఉన్నాయని.. పేలుడు సంభవించిన సమయంలో ఇంట్లో 11 మంది ఉన్నారని సమాచారం. ఇంట్లో నిలువ చేసిన బాణాసంచాకు నిప్పు అంటుకొని మంటలు వ్యాపించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పరిస్థితి అదుపులో ఉందని.. సహాయక చర్యలు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంట్లో పటాకులు తయారు చేస్తున్నారా? లేదా? తెలుసుకునేందుకు దర్యాప్తు నిర్వహించనున్నట్లు మరో పోలీస్‌ అధికారి పేర్కొన్నారు.

Tags

Next Story