Karnataka: నలుగురు కాలేజీ అమ్మాయిలు మిస్సింగ్.. తమ బాధ్యత కాదన్న ప్రిన్సిపల్..

Karnataka: నలుగురు కాలేజీ అమ్మాయిలు మిస్సింగ్.. తమ బాధ్యత కాదన్న ప్రిన్సిపల్..
Karnataka: 'కచ్చితంగా అమ్మాయిలు బయటే మిస్ అయ్యిండొచ్చు. వారు ఒక్కసారి కాలేజీలోకి అడుగుపెడితే ఇంక అది మా బాధ్యత.'

Karnataka: కర్ణాటకలోని రాయచూరు ప్రభుత్వ కాలేజీ నుండి నలుగురు అమ్మాయిలు మిస్ అవ్వడం కలకలం సృష్టిస్తోంది. వారు ఇంటర్ సెకండియర్ చదువుతున్న మౌనిక, భాగ్య శ్రీ, భవానీలతో పాటు ఫస్ట్ ఇయర్ చదువుతున్న నందినిగా గుర్తింపు. అటెండెన్స్ రిజిస్టర్ ప్రకారం ఈ నలుగురు నాలుగు రోజులుగా కాలేజీకి రావడం లేదని కాలేజీ యాజమాన్యం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు.. కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఈ నలుగురు అమ్మాయిల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ నలుగురు ముందు నుండి కూడా కాలేజీకి రెగ్యులర్‌గా వచ్చేవారు కాదని, చదువులో వెనకబడి ఉండేవారని ప్రిన్సిపల్ తెలిపారు.

'కచ్చితంగా అమ్మాయిలు బయటే మిస్ అయ్యిండొచ్చు. వారు ఒక్కసారి కాలేజీలోకి అడుగుపెడితే ఇంక అది మా బాధ్యత. నేను, టీచర్లు ఎప్పుడూ విద్యార్థులపై ఓ కన్నేసి ఉండడం కోసం రౌండ్స్‌కు వెళ్తూనే ఉంటాం. దయచేసి తల్లిదండ్రులు ఎవరూ భయపడకుండా తమ పిల్లలను కాలేజీకి పంపాలని కోరుకుంటున్నాను' అని ప్రిన్సిపల్ ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story