బీహార్‌లో పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్

బీహార్‌లో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. బక్సర్ జిల్లాలోని రఘునాథ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఐదు బోగీలు బుధవారం సాయంత్రం పట్టాలు తప్పాయి. ఇందులో మూడు ఏసీ బోగీలు ఉన్నాయి. అయితే ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారని అధికారులు తెలిపారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ నుంచి వస్తున్న ఈ రైలు అస్సాంలోని కమాఖ్య జంక్షన్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
బీహార్ రాష్ట్రంలో బక్సర్ జిల్లాలోని రఘునాథ్‌పూర్ స్టేషన్ సమీపంలో నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనల నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ నుంచి వస్తున్న నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ అసోం రాష్ట్రంలోని గౌహతిలోని కామాఖ్య జంక్షన్‌కు వెళుతుండగా బుధవారం రాత్రి 9:53 గంటలకు రైలు ఆరు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో మరో 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
ఈ రైలు ప్రమాదంలో 50 మంది గాయపడ్డారని తూర్పు మధ్య రైల్వే జోన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ బీరేంద్ర కుమార్ తెలిపారు. ఈ రైలు పట్టాలు తప్పిన తర్వాత ఢిల్లీ-దిబ్రూగఢ్ మధ్య రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో సహా 18 రైళ్లను దారి మళ్లించారు. కోచ్‌ల పునరుద్ధరణ కోసం వార్‌రూమ్‌లను ఏర్పాటు చేశామని, రెస్క్యూ ఆపరేషన్‌లు కొనసాగుతున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. న్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జిల్లా యంత్రాంగం, రైల్వే అధికారులు, స్థానికులు కలిసి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. విపత్తు నిర్వహణ శాఖ, బక్సర్, భోజ్‌పూర్ ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడినట్లు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తెలిపారు. వీలైనంత త్వరగా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు తగిన వైద్య ఏర్పాట్లు చేయాలని తేజస్వీ ఆదేశించారు.
నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, బక్సర్‌లోని జిల్లా అధికారులతో, ఇతర ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నామని అసోం ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్ లో తెలిపింది. సంఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు, అంబులెన్స్‌లు మరియు వైద్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఈరైలు ప్రమాదానికి టెక్నికల్ లోపం ఏదైనా ఉందా లేక రైలు పట్టాలపై ఎవరైనా ఉద్దేశ పూర్వకంగానే రాళ్లు పెట్టి పట్టాలు తప్పి ప్రమాదం జరగాలని చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com