JK: జమ్ము కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్
జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్టులు, భద్రతా బలగాలకు మధ్య రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్ కౌంటర్లు జరిగాయి. శనివారం కూల్గాం జిల్లాలో సైన్యం యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లు నిర్వహించింది. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు, నలుగురు టెర్రరిస్టులు మరణించారు. దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో టెర్రరిస్టులు ఉన్నారని ఆర్మీకి సమాచారం అందింది. దీంతో మోడెర్గామ్ గ్రామంలో సీఆర్ పీఎఫ్, ఆర్మీ, స్థానిక పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. టెర్రరిస్టులు ఎదురుకాల్పులు జరపడంతో ఓ జవానుకు తీవ్ర గాయాలయ్యి మృతి చెందారు. జిల్లాలోని ఫ్రీసల్ ప్రాంతంలో జరిగిన మరో ఎన్ కౌంటర్ లో ఒక సైనికుడు, నలుగురు టెర్రరిస్టులు మరణించారు.
కుల్గాం జిల్లాలోని ఫ్రిసల్ చిన్నిగాం, మోడెర్గాం గ్రామాల్లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం ఆధారంగా, భద్రతాబలగాలు కార్డెన్సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. దీనితో ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. మోర్గాంలోని ఓ ఇంటి వద్దకు వెళ్లిన సైన్యం, సీఆర్పీఎఫ్ బలగాలపై ముష్కరులు భారీస్థాయిలో కాల్పులు జరపగా, ఓ సైనికుడు వీరమరణం పొందారు. ఫ్రిసల్ చిన్నిగాంలో జరిగిన మరో భారీ ఎన్కౌంటర్లో సైన్యం నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టగా, ఓ సైనికుడు అమరుడయ్యారు. ఆ రెండు చోట్లా ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సైనికాధికారులు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com