ENCOUNTER: నలుగురు ముష్కరులు హతం

ENCOUNTER: నలుగురు ముష్కరులు హతం
జమ్ముకశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు

జమ్ముకశ్మీర్‌((Jammu and Kashmir)లో భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయి. దేశ భద్రతకు ముప్పుగా మారిన నలుగురు ముష్కరులను మట్టుబెట్టాయి. పూంచ్‌ జిల్లాలోని (Poonch) సింధారా (Sindhara) ప్రాంతంలో స్థానిక పోలీసులతో కలిసి ఇండియన్‌ ఆర్మీ ప్రత్యేక దళాలు, రాష్ట్రీయ రైఫిల్స్‌ సంయుక్తంగా ఉగ్రవాదుల కోసం ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టాయి. గాలింపు చర్యలు చేపడుతున్న భద్రత దళాలను చూసిన ముష్కరులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ముష్కరుల (Terrorists) కాల్పులను భద్రత దళాలు సమర్థంగా తిప్పికొట్టాయి.


ఎన్‌కౌంటర్‌లో (Encounter)నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు. వారంతా విదేశీ ఉగ్రవాదులేనని అనుమానిస్తున్నట్లు వెల్లడించారు. వారు ఏ ఉగ్ర సంస్థకు చెందినవారనే విషయం ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఘటనా స్థలంలో ఏకే-47 రైఫిల్‌, మ్యాగజైన్‌, 11 రౌండ్ల బుల్లెట్లు, ఇతర మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగుతున్నదని చెప్పారు.

Tags

Next Story