INS Vikrant: మెరైన్‌ రఫేల్‌ డీల్స్‌లో తుది ధర సమర్పించిన ఫ్రాన్స్‌

INS Vikrant: మెరైన్‌ రఫేల్‌ డీల్స్‌లో తుది ధర సమర్పించిన ఫ్రాన్స్‌
X
అజిత్ దోవల్ ఫ్రాన్స్‌ పర్యటనకు ముందే

భారత నేవీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ కోసం కోనుగోలు చేయతలపెట్టిన మెరైన్‌ రఫేల్స్‌ యుద్ధ విమానాల డీల్‌లో మరో అడుగు ముందుకుపడింది. ఫ్రాన్స్‌ వీటికి సంబంధించిన తుది ధరను భారత్‌కు సమర్పించినట్టు సమాచారం. ఈసారి న్యూదిల్లీ వీటి ధర విషయంలో కొంచెం బలంగా పట్టుబట్టడంతో చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రయోజనం కనిపించిందని ఓ ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది.

భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డొభాల్‌ పర్యటనకు కొద్దిగా ముందే ఈ వివరాలు వెలువడటం గమనార్హం. గత వారం ఇరు దేశాలకు చెందిన బృందాలు న్యూదిల్లీలో చర్చలు జరిపాయి. రేపటి నుంచి భారత్‌-ఫ్రాన్స్‌ వ్యూహాత్మక చర్చలు పారిస్‌లో ప్రారంభం కానున్నాయి. వీటిలో ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ డొభాల్‌ పాల్గోనున్నారు. అలాగే, కఠినమైన చర్చల తర్వాత ప్రతిపాదిత ఒప్పందం ధరలో గణనీయమైన తగ్గింపు జరిగింది. 26 రాఫెల్ మెరైన్ జెట్‌లను కొనుగోలు చేసేందుకు భారత్, ఫ్రాన్స్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఆ మెరైన్‌ జెట్‌లను ఐఎన్‌ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌక, వివిధ స్థావరాలపై మోహరిస్తారు. భారత్‌తో చర్చలను ఖరారు చేసేందుకు ఫ్రెంచ్ బృందం దేశ రాజధానిలో ఉన్నప్పుడు ఇరుపక్షాలు గత వారం కూడా చర్చలు జరిపాయి.

భారత నౌకాదళం సరికొత్త విమాన వాహక నౌకను పూర్తిస్థాయిలో వినియోగించుకొనేందుకు ఈ డీల్‌ చాలా ముఖ్యం. దీంతో తాజాగా గవర్నమెంట్‌ టు గవర్నమెంట్‌ విధానంలో యుద్ధ విమానాల కొనుగోళ్లకు చర్చలు జరుగుతున్నాయి. ఈ సరికొత్త విమానాల్లో భారత్‌ అభివృద్ధి చేసిన ఉత్తమ్‌ రాడార్‌ను కూడా అనుసంధానించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు సుమారు 8 ఏళ్ల సమయం పడుతుందని.. అదే సమయంలో ఫ్రాన్స్‌కు చెల్లింపులు కూడా చేయాల్సివస్తుంది. దీంతోపాటు, దేశీయంగా తయారుచేసిన అస్త్ర, రుద్రం క్షిపణులను కూడా ఈ విమానాలకు ఇంటిగ్రేడ్‌ చేయాలని న్యూదిల్లీ కోరుతోంది.దీంతోపాటు వాయుసేనకు అవసరమైన 40 డ్రాప్‌ ట్యాంక్‌ల కొనుగోలు, స్వల్ప సంఖ్యలో వర్క్‌స్టేషన్ల ఏర్పాటు వంటి అంశాలు కూడా ఈ ఒప్పంద చర్చల్లో ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

Tags

Next Story