Free Fire Game: ఫ్రీ ఫైర్లో డబ్బులు పోగొట్టుకోని 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్య ..

ఫ్రీ ఫైర్ కారణంగా మరో ప్రాణం బాలి అయ్యింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. 13 ఏళ్ల ఆక్లాన్ జైన్ అనే ఏడవ తరగతి విద్యార్థి, ఆన్‌లైన్ గేమ్ ఫ్రీ ఫైర్ ఆడుతూ రూ.2,800 పోగొట్టుకున్న తర్వాత, తల్లిదండ్రులు కొడతారన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం రాత్రి ఇండోర్ నగరంలోని అనురాగ్ నగర్ లో చోటుచేసుకుంది. ఆక్లాన్ జైన్ అనే బాలుడు, ఇంట్లో ఉన్న సమయంలో ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతూ.. తన తల్లి డెబిట్ కార్డ్‌ను గేమ్ IDకి లింక్ చేసి రూ.2,800 ఖర్చు చేశాడు. ఆ విషయాన్ని తన తల్లికి తెలిపిన తరువాత.. వారేమంటారో అనే భయంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆక్లాన్ ఉరివేసుకుని ఉన్న దృశ్యాన్ని అతని తాత గమనించి కుటుంబ సభ్యులకు తెలిపాడు. అక్కడి పరిస్థితిని గమనించిన కుటుంబీకులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతడు మరణించాడని వైద్యులు నిర్ధారించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి, అధికారికంగా కేసు నమోదు చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి MIG పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సీ.బీ. సింగ్ ప్రకారం.. ఆక్లాన్ వద్ద సిమ్ కార్డ్ లేని మొబైల్ ఉండేది. కానీ అది Wi-Fi ద్వారా కనెక్ట్ అయి ఉండేది. ఆ ఫోన్ ద్వారా తన తల్లి అపూర్వ జైన్ డెబిట్ కార్డ్‌ను లింక్ చేసి గేమ్‌లో రూ.2,800 ఖర్చు చేశాడని.. ఆ విషయాన్ని తల్లికి చెప్పిన తర్వాత బాలుడు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు.
ఆక్లాన్ ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు. అతనికి ఓ తమ్ముడు ఉన్నాడు. తండ్రి అంకేష్ జైన్. అతను ఆటో పార్ట్స్ దుకాణాలను నడుపుతున్న వ్యాపారి. కేసును పరిశీలిస్తున్న పోలీసులు, ఆక్లాన్ మృతదేహాన్ని MY హాస్పిటల్‌కు పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఈ సంఘటనతో పిల్లల్లో డిజిటల్ అలవాట్లపై పెద్దల మార్గనిర్దేశం ఎంత అవసరమో మరోసారి అర్థమవుతుంది. పిల్లలు మొబైల్, గేమింగ్‌పై అదుపు కోల్పోకుండా డిజిటల్ సంస్కారాన్ని నేర్పే బాధ్యత తల్లిదండ్రులదని వైద్య నిపుణులు, పిల్లల మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com