MANIPUR: స్వాతంత్ర్య సమరయోధుడి భార్య సజీవ దహనం

MANIPUR: స్వాతంత్ర్య సమరయోధుడి భార్య సజీవ దహనం
మణిపూర్‌లో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న దారుణాలు.... ఇంటికి నిప్పంటించి వృద్ధురాలి సజీవ దహనం

మణిపూర్‌(Manipur)లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్న వేళ.. మహిళలపై జరిగిన సామూహిక అఘాయిత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇంఫాల్‌కు 45 కిలోమీటర్ల దూరంలోని సేరో గ్రామంలో కొందరు దుండగులు 80 ఏళ్ల(80-year-old wife) ఇబెటోంబీ అనే వృద్ధురాలి‍Freedom Fighter's Wife‌) ఇంటికి నిప్పుపెట్టి ఆమెను సజీవ దహనం( Burnt Alive) చేసినట్లు బయటపడడం కలకలం రేపుతోంది. కక్‌చింగ్‌ జిల్లాలోని సెరౌ గ్రామంలో స్వాతంత్య్ర సమరయోధుడి(freedom fighter) భార్య అయిన ఇబేటోంబిని దుండగులు సజీవంగా తగులబెట్టారు.

మే 28న తెల్లవారుజామున ఇబెటోంబీ ఇంటికి ఆందోళనకారులు నిప్పంటించారు. ఇంట్లో ఉన్నవారిని వెళ్లిపొమ్మని చెప్పిన ఆమె మాత్రం బయటకు రాలేక సజీవ దహనమయ్యారు. ఈమె మనమడికి కూడా బుల్లెట్‌ గాయాలయ్యాయి. అయినా అతడు తప్పించుకుని పారిపోయాడు. ఇబెటోంబీ భర్త చురాచంద్‌ సింగ్‌ స్వాతంత్య్ర సమరయోధుడు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం‍(APJ Abdul Kalam) చేతుల మీదుగా అవార్డు కూడా అందుకున్నారు. చురాచంద్‌ సింగ్‌ 80వ ఏట మరణించాడు.

ణిపూర్‌లో జరిగిన దారుణాలు గగుర్పాటుకు గురిచేస్తున్నాయి. మహిళలను నగ్నంగా ఊరేగించిన కాంగ్పోక్పి జిల్లాకి 40 కిలోమీటర్ల దూరంలో మరో దారుణం వెలుగుచూసింది. కార్ల సర్వీస్‌ షోరూంలో పనిచేస్తున్న ఇద్దరు కుకీ యువతులను తీవ్రంగా హింసించి అత్యాచారం చేసినట్లు తాజాగా బయటపడింది. బాధితుల్లో ఒకరి వయసు 21 కాగా మరొకరికి 24 ఏళ్లు. ఇంఫాల్‌ తూర్పు జిల్లా కొనుంగ్‌ మామాంగ్‌ ప్రాంతంలోని షో రూంలో ఉండగా వీరిపై మూక దాడికి దిగింది. మూకలోని మహిళలు.. గదిలోకి తీసుకెళ్లి యువతులపై అత్యాచారం చేయాలంటూ పురుషులను రెచ్చగొట్టారని షోరూంలో పనిచేసే యువకుడు తెలిపాడు. దుస్తులు చినిగిపోయి, ఒళ్లంతా రక్తంతో ఉన్న యువతులను బయటకు తీసుకొచ్చి కట్టెల మిల్లు సమీపంలో పడేశారు. భయంతో దీనిపై తొలుత ఎవరూ ఫిర్యాదు చేయలేదు. చివరకు ఓ యువతి తల్లి ధైర్యం చేసి మే 16న సైకుల్‌ ఠాణాకు వెళ్లగా జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ఇటు.. మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లోని ఘరీ ప్రాంతంలో శనివారం మళ్లీ నిరసనలు ఎగిసిపడ్డాయి. హైవేను నిరసనకారులు దిగ్బంధించారు. టైర్లు దహనం చేశారు. పోలీసులు, సైన్యం, ర్యాపిడ్‌ యాక్షన్‌ బెటాలియన్‌ రంగంలోకి దిగాయి. భాష్ప వాయువును ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. ఇంఫాల్‌లోని పలుప్రాంతాల్లో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. మహిళలను నగ్నం గా ఊరేగించిన ఘటనలో బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలంటూ యునైటెడ్‌ నాగా కౌన్సిల్‌, ఆల్‌ నాగా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ మణిపూర్‌, నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ డిమాండ్‌ చేశాయి.

Tags

Read MoreRead Less
Next Story