టీవీ యాంకర్ నుండి పొలిటికల్ లీడర్ గా.. అతి పిన్న వయస్కురాలైన మహిళా ఎమ్మెల్యే

టీవీ యాంకర్ నుండి పొలిటికల్ లీడర్ గా.. అతి పిన్న వయస్కురాలైన మహిళా ఎమ్మెల్యే
32 సంవత్సరాల వయస్సులో, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలలో బారిల్ వన్నెహ్సాంగి (32) విజయం సాధించారు.

32 సంవత్సరాల వయస్సులో, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలలో బారిల్ వన్నెహ్సాంగి (32) విజయం సాధించారు. ఐజ్వాల్ సౌత్-III నియోజకవర్గం నుండి ఆమె గెలుపొందారు. రాష్ట్రంలోని అతి పిన్న వయస్కురాలైన మహిళా ఎమ్మెల్యేగా బారిల్ నిలిచారు. జోరాం పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM) సభ్యురాలైన బారిల్ వన్నెహ్సాంగి మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఆమె 1,414 ఓట్ల తేడాతో ప్రత్యర్థిపై గెలుపొందారు.

ఇటీవల జరిగిన మిజోరాం అసెంబ్లీ ఎన్నికలలో, జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM) విజయం సాధించింది, 40 అసెంబ్లీ స్థానాల్లో 27 స్థానాలను కైవసం చేసుకుంది, మిజో నేషనల్ ఫ్రంట్ (MNF)ని తొలగించడంతో అధికారాన్ని గణనీయంగా మార్చింది. గెలిచిన వెంటనే, మాజీ టీవీ ప్రెజెంటర్ లింగ సమానత్వం గురించి గట్టిగా మాట్లాడారు. మహిళలు తమకు ఇష్టమైన రంగంలోకి ప్రవేశించి తమ అభిరుచిని కొనసాగించాలని కోరారు.

“మన సంకల్పం బలంగా ఉంటే మనం ఇష్టపడే, కొనసాగించాలనుకునే ఏ పనిని చేయకుండా ఏ శక్తీ ఆపదని నేను ఇక్కడ ఉన్న మహిళలందరికీ చెప్పాలనుకుంటున్నాను. వారికి నా సందేశం ఏమిటంటే, వారు ఏ కమ్యూనిటీ లేదా సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా, వారు ఏదైనా చేపట్టాలనుకుంటే, వారు దాని కోసం కష్టపడాలి, ”అని ఆమె మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

బారిల్ మేఘాలయలోని షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ హిల్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పూర్తిచేశారు. రాజకీయాల్లోకి ప్రవేశించేముందు, ఆమె ఐజ్వాల్ మున్సిపల్ కార్పొరేషన్ (AMC) లో కార్పొరేటర్‌గా పనిచేశారు. ఎన్నికల కమిషన్ అఫిడవిట్ ప్రకారం, ఆమెపై ఎటువంటి క్రిమినల్ రికార్డులు లేవు. బారిల్ టీవీ యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది.

మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో 174 మంది అభ్యర్థుల్లో 16 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. వీరిలో ఇద్దరు చొప్పున రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడంతో 18 స్థానాల్లో మహిళా అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2023 నవంబర్ 4న ప్రకటించబడ్డాయి. జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM) 27 స్థానాలను గెలుచుకోవడం ద్వారా ప్రస్తుత జోరంతంగా నేతృత్వంలోని మిజో నేషనల్ ఫ్రంట్ (MNF)ని ఓడించి విజయం సాధించింది. MNF 10 సీట్లు గెలుచుకోగా, భారతీయ జనతా పార్టీ 2 సీట్లు గెలుచుకోగలిగింది.

Tags

Next Story