G7 Summit: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ప్రధానీ మోదీ ముచ్చట

G7 Summit: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ప్రధానీ  మోదీ ముచ్చట
ప్రధాని మోదీ జపాన్‌ పర్యటనలో బీజీబిజీగా ఉన్నారు.జీ-7 దేశాలసదస్సు, క్వాడ్ దేశాల సదస్సు కోసం మోదీ జపాన్లో పర్యటిస్తున్నారు

ప్రధాని మోదీ జపాన్‌ పర్యటనలో బీజీబిజీగా ఉన్నారు. జీ-7 దేశాల సదస్సు, క్వాడ్ దేశాల సదస్సు కోసం మోదీ జపాన్ లో పర్యటిస్తున్నారు. ఈ రెండు సదస్సులకు ఆతిథ్యమిస్తున్న హిరోషిమా నగరంలో మోదీ వరుస సమావేశాలతో బిజీగా గడిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని కలిశారు మోదీ. రష్యాతో సంక్షోభం ముగింపునకు చర్చలు, దౌత్య విధానాలే పరిష్కార మార్గాలు అని, ఈ దిశగా తమ మద్దతు ఉంటుందని జెలెన్ స్కీకి స్పష్టం చేసినట్టు మోదీ వెల్లడించారు. ఉక్రెయిన్ ప్రజలకు మానవతా సాయాన్ని అందించడం కొనసాగిస్తామని జెలెన్ స్కీతో చెప్పినట్లు తెలిపారు.

అంతకుముందు, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తోనూ మోదీ సమావేశమయ్యారు. ఐటీ, ఆవిష్కరణల రంగం, టెక్నాలజీ, సెమీకండక్టర్ల ఉత్పాదన వంటి అంశాలపై సహకార విస్తరణ దిశగా చర్చలు జరిపామని మోదీ వెల్లడించారు. తమ మధ్య చర్చల్లో వాణిజ్య ఒప్పందాలు, రక్షణ రంగ సంబంధాలు బలోపేతం చేసే అంశం కూడా ప్రస్తావనకు వచ్చిందన్నారు.

అలాగే పీఎం నరేంద్ర మోదీ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో సమావేశమయ్యారు. ఆత్మీయంగా మాట్లాడుకుంటూ కౌగిలించుకున్నారు. ఈ సందర్బంగా వారి మధ్య కొంతసేపు సంభాషణ కూడా జరిగింది. G-7 దేశాల సదస్సులో భారత్, జపాన్, బ్రిటన్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇండోనేషియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా, ఇటలీ, దక్షిణ కొరియా, వియత్నం సహా పలు దేశాల అధినేతలు పాల్గొన్నారు. ఈ క్రమంలో సమ్మిట్ లో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ఇక జపాన్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ హిరోషిమాలో మహాత్మాగాంధీ ప్రతిమను ఆవిష్కరించారు. భారత జాతిపితకు ఘన నివాళి అర్పించారు.

Tags

Read MoreRead Less
Next Story