Gujarat: ఒక్కసారిగా కూలిపోయిన బ్రిడ్జి.. నదిలో పడిపోయిన వాహనాలు

Gujarat: ఒక్కసారిగా కూలిపోయిన బ్రిడ్జి.. నదిలో పడిపోయిన వాహనాలు
X
తొమ్మిది మంది మృతి.

గుజరాత్‌లో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. వాడుకలో ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. వాహనాలు రాకపోకలు జరుగుతున్న సమయంలోనే బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఒకదానివెంట ఒకటి వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో తొమ్మిది మరణించారు. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గుజరాత్‌లోని వడోదరలో పద్రా వద్ద మహిసాగర్ నదిపై గంభీర బ్రిడ్జి ఉంది. 1985లో దీన్ని నిర్మించారు. గుజరాత్‌లోని వడోదర – ఆనంద్ పట్టణాలను ఈ బ్రిడ్జి కలుపుతుంది. కొన్ని రోజులుగా స్థానికంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఈ బ్రిడ్జి మధ్య భాగం కూలిపోయింది. దాదాపు నాలుగు వాహనాలు నదిలో పడిపోయాయి. బ్రిడ్జి కూలిపోయిన ప్రదేశంలో చివరి అంచున ఓ ట్యాంకర్ వాహనం నిలిచిఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోచూస్తే ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుంది.

గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ మాట్లాడుతూ.. తొమ్మిది మృతదేహాలను వెలికితీయడం జరిగిందని, ఆరుగురిని కాపాడామని తెలిపారు. మరోవైపు.. ఈ ఘటనపై ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్పందించారు. సంఘటనా స్థలానికి వెళ్లి వంతెన కూలడానికి గల కారణాలను గుర్తించాలని సాంకేతిక నిపుణులను ఆదేశించారు.

Tags

Next Story