Gangster Killed : పూణేలో గ్యాంగ్‌స్టర్ దారుణ హత్య..

పూణేకు చెందిన గ్యాంగ్‌స్టర్ శరద్ మోహల్ ను సొంత ముఠా సభ్యులే దారుణంగా కాల్చి చంపారు. మధ్యాహ్నం 1:30 గంటలకు, 40 సంవత్సరాల వయస్సు గల మోహోల్‌పై ముగ్గురు నుండి నలుగురు దుండగులు మెరుపుదాడి చేశారని, వారు అతనిపై సమీపం నుండి కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. ఒక బుల్లెట్ అతని ఛాతీని తాకగా, మరో రెండు బుల్లెట్లు అతని కుడి భుజానికి తగిలాయి. అత్యవసర చికిత్స కోసం కోత్రుడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ మోహోల్ ప్రాణాలతో బయటపడలేదు.
అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారని PTI నివేదించింది. కొత్రుడ్‌లోని సుతార్ దారా ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం మొహోల్‌పై కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. గ్యాంగ్‌లో తలెత్తిన భూమి, డబ్బుకు సంబంధించిన వివాదమే హత్యకు కారణమని తెలుస్తోంది. కాల్పులకు పాల్పడినట్టు అనుమానిస్తున్న ఎనిమిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి మూడు పిస్టల్స్, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తునకు ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశారు.
మొహొల్‌పై పలు హత్య, దోపిడీ కేసులు ఉన్నాయి. ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన అనుమానిత ఉగ్రవాది మొహమ్మద్ ఖతీల్ సిద్ధిఖీని యరవాడ జైలులో హత్యచేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ నిర్దోషిగా బయటపడ్డాడు.మొహోల్‌ను అతని అనుచరులే చంపారని ఇది గ్యాంగ్ వార్ కాదని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com