PM’s Oath sarmani : ప్రమాణస్వీకార కార్యక్రమంలో తళుక్కుమన్న తారలు

హాజరైన పారిశ్రామికవేత్తలు

ప్రధాని నరేంద్రమోడీ ప్రమాణస్వీకారంలో పారిశ్రామికవేత్తలు, సినీ తారలు మెరిశారు. రాష్ట్రపతి భవన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ, సూపర్ స్టార్లు షారుఖ్ ఖాన్, రజనీకాంత్, అక్షయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. మరోవైపు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాన్ భార్యా సమేతంగా ఈ కార్యక్రమానికి వచ్చారు. 12TH ఫెయిన్ యాక్టర్ విక్రాంత్ మాస్సేతో పాటు ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

ప్రధానిగా మూడోసారి నరేంద్రమోడీ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్రమాణస్వీకారం చేయించారు. మొత్తం 72 మందితో మోడీ 3.0 కేబినెట్ ఉండబోతోంది. ఇందులో 30 మంది కేంద్రమంత్రులు కాగా, మిగిలిన వారు సహాయమంత్రులుగా ఉండబోతున్నారు. ఎన్డీయే కూటమిలోని తెలుగుదేశం, శివసేన, జేడీయూ, ఎల్జేపీ వంటి మిత్రపక్షాలకు సంబంధించి 11 మందికి మంత్రి పదవులు దక్కాయి.

ఇదే కాకుండా పొరుగుదేశాలు ఫస్ట్ అనే భారత విధానానికి అనుగుణంగా మన చుట్టుపక్కల ఉన్న దేశాల అధినేతలకు ఆహ్వానాలు అందాయి. పీఎం మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్‌, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేతో సహా పలువురు అంతర్జాతీయ దేశాధినేతలు హజరయ్యారు.

ఈసారి క్యాబినెట్‌లో 33 మంది కొత్త వారికి చోటు దక్కింది. 30 మంది మంత్రుల్లో ఏడుగురు కొత్త వారు. కాగా, కేంద్ర క్యాబినెట్‌లోకి 81 మందిని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే, ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీతో సహా మొత్తం 72 మంది కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. మరో తొమ్మిది మందిని క్యాబినెట్‌లోకి తీసుకోవడానికి అవకాశం ఉంది. క్యాబినెట్‌ విస్తరణ జరిపి ఈ పదవులను కూడా భర్తీ చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. అయితే, గత క్యాబినెట్‌లో 78 మంది సభ్యులుగా ఉన్నారు.

Tags

Next Story