Shocking Video : బైకర్స్ మొబైల్ లాక్కోవడంతో రోడ్డుపై పడి, ప్రాణాలు కోల్పోయిన బాలిక

Shocking Video : బైకర్స్ మొబైల్ లాక్కోవడంతో రోడ్డుపై పడి, ప్రాణాలు కోల్పోయిన బాలిక
X
హైవేపై పడి ప్రాణాలు కోల్పోయిన బాలిక.. ఆటోను వెంబడించిన మొబైల్ లాక్కున్న దుండగులు

హైవేపై పడి బాలిక ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మొబైల్‌ ఫోన్‌ను బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు లాక్కెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ కావడంతో తాజాగా ఈ విషయం బయటపడింది. ఈ ఘటనలో బాలికను చాలా దూరం వెంబడించి ఆమె ఫోన్‌తో దుండగులు పారిపోయారు.

ఈ షాకింగ్ సీసీటీవీ ఫుటేజీలో, బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు తమ బైక్‌ను ఆటో రిక్షాకు దగ్గరగా తీసుకురావడం, అమ్మాయి లోపల కూర్చున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె నుండి ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించారు, కానీ అమ్మాయి వారితో పోరాడుతూ కనిపించింది. రెండు వాహనాలు చాలా వేగంతో వెళుతున్నప్పటికీ, దుర్మార్గులు తమ ప్రయత్నాలను కొనసాగించారు. ఇంతలో ఆ బాలిక నడిరోడ్డుపై పడి తలకు తీవ్రగాయాలు కావడంతో దుండగులు చివరకు ఫోన్ లాక్కొని పారిపోయారు.

ఈ ప్రమాదంలో బాలిక తలకు బలమైన గాయాలు కావడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. తీవ్ర గాయాలపాలైన ఆమె ఆదివారం (అక్టోబర్ 29) తుదిశ్వాస విడిచింది. వెబ్‌సిటీ ఫ్లైఓవర్‌పై శుక్రవారం (అక్టోబర్ 27) ఈ సంఘటన జరగడంతో బల్బీర్, జితేంద్రగా గుర్తించిన నిందితులిద్దరి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆదివారం (అక్టోబర్ 29) పోలీసుల జరిపిన కాల్పుల్లో గాయపడిన బల్బీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే రెండో నిందితుడు జితేంద్ర మాత్రం తప్పించుకున్నాడు. సోమవారం (అక్టోబర్ 30) పోలీసుల ఎన్ కౌంటర్ లో జితేంద్ర కూడా హతమయ్యాడు.

Next Story