Karnataka: డ్రైవర్‌తో యువతి ప్రేమాయణం.. అసలు విషయం తెలిసాకే అసలైన ట్విస్ట్..

Karnataka: డ్రైవర్‌తో యువతి ప్రేమాయణం.. అసలు విషయం తెలిసాకే అసలైన ట్విస్ట్..
Karnataka: యజమాని కూతురు అక్షితను తానే రోజూ కాలేజీలో దింపేవాడు. అలా వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి తర్వాత ప్రేమగా మారింది

Karnataka: మామూలుగా ప్రేమించి పెళ్లి చేసుకునేవారు ఎందరో ఉన్నారు. అందులోనూ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని ఇంట్లో నుండి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్న వారు కూడా ఉన్నారు. అయితే అందులో మరో అరుదైన వారు కూడా ఉంటారు. ప్రేమించిన వారు మోసం చేస్తున్నారని తెలిసినా.. వారితోనే ఉండాలి అనుకునేవారు కూడా ఉంటారని ఈ లవ్ స్టోరీ చూస్తే తెలుస్తుంది.

కర్ణాటకలోని విజయపుర జిల్లా జాలగేరి గ్రామంలో ఓ కుటుంబం వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తు్న్నాడు సోమలింగ. అయితే అతడి యజమాని కూతురు అక్షితను తానే రోజూ కాలేజీలో దింపేవాడు. అలా వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి తర్వాత ప్రేమగా మారింది. అయితే అక్షిత ఇంట్లో వారికి చెప్తే ఒప్పుకోరని సోమలింగను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది.

వారి విషయం తెలిసిన తర్వాత అక్షిత ఇంట్లోవారు సోమలింగ గురించి ఆరాతీశారు. అప్పుడే వారికి అతడి గురించి నిజాలు తెలిశాయి. సోమలింగకు ఇదివరకే పెళ్లయిందని, పిల్లలు కూడా ఉన్నారన్న విషయం బయటపెడింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కానీ అక్షిత మాత్రం సోమలింగతోనే తన జీవితం అన్నట్టుగా ఇంట్లోవారిని వద్దనుకుంది.

సోమలింగకు ఇదివరకే పెళ్లయిందని అక్షితకు ముందే తెలుసని చెప్పింది. అయినా కూడా తనను ప్రేమించానని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. అంతే కాకుండా సోమలింగ మొదటి భార్య, పిల్లలతో కలిసి తాను కూడా సంతోషంగా ఉంటానని తేల్చి చెప్పింది. అంతే కాకుండా పుట్టింటి నుండి తనకు ప్రాణహాని ఉందంటూ అక్షిత పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.

Tags

Read MoreRead Less
Next Story