రాష్ట్రంలో మోదీ నాయకత్వానికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

రాష్ట్రంలో మోదీ నాయకత్వానికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
ఒక్కసారి నరేంద్ర మోదీ నాయకత్వానికి రాష్ట్రంలో అవకాశం ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బెంగాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీకి అవకాశం ఇస్తే బంగారు బెంగాల్..

ఒక్కసారి నరేంద్ర మోదీ నాయకత్వానికి రాష్ట్రంలో అవకాశం ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బెంగాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీకి అవకాశం ఇస్తే బంగారు బెంగాల్‌ తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. బెంగాల్ పర్యటనలో అమిత్‌ షా రెండో రోజు... కోల్‌కతాలో కాళీమాత ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడిన అమిత్‌షా.... మమతా బెనర్జీ పాలనపై ప్రజలు తీవ్ర నిరాశల్లో ఉన్నారని అన్నారు. మమతా పాలనలో 100 మందికి పైగా బీజేపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని తెలిపారు. ఈ హత్యలకు సీఎం బెనర్జీ తీసుకున్న చర్యలేమిటో వివరించాలని డిమాండ్ చేశారు.

కరోనా, వరదల సహాయంలోనూ తృణమూల్ సర్కారు అవినీతికి పాల్పడిందని అమిత్ షా ఆరోపించారు. కేంద్రం తీసుకొచ్చిన పథకాలను రాష్ట్రంలో అమలు చేసే విషయంలో... బెంగాల్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. ప్రజలు తృణమూల్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బెంగాల్‌లో 200 సీట్లు సాధిస్తామని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు.

Tags

Next Story