Goa: ప్రపంచంలోనే ఎత్తైన శ్రీరాముని విగ్రహం. ఆవిష్కరించిన ప్రధాాని..

Goa: ప్రపంచంలోనే ఎత్తైన శ్రీరాముని విగ్రహం. ఆవిష్కరించిన ప్రధాాని..
X
గుజరాత్‌లో ఐక్యతా విగ్రహాన్ని రూపొందించిన కళాకారుడు రామ్ సుతార్ ఈ విగ్రహాన్ని రూపొందించారని ప్రజా పనుల శాఖ మంత్రి దిగంబర్ కామత్ తెలిపారు.

శ్రీ సంస్థాన్ గోకర్ణ్ పార్టగలి జీవోత్తమ మఠం 550వ వార్షికోత్సవాల సందర్భంగా గోవాలోని పార్టగలిలో 77 అడుగుల ఎత్తైన రాముడి కాంస్య విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాముడి శిల్పం కూడా. కర్ణాటకలో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

గుజరాత్‌లో ఐక్యతా విగ్రహాన్ని రూపొందించిన కళాకారుడు రామ్ సుతార్ ఈ విగ్రహాన్ని రూపొందించారని ప్రజా పనుల శాఖ మంత్రి దిగంబర్ కామత్ తెలిపారు.

శ్రీరాముని భారీ విగ్రహ ఆవిష్కరణ

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగలి జీవోత్తమ మఠం యొక్క కొత్తగా అభివృద్ధి చేసిన ప్రాంగణాన్ని ప్రారంభిస్తారని అన్నారు.

ఈ కార్యక్రమానికి 15,000 మందికి పైగా హాజరవుతారని 11 రోజుల వేడుకలో దాదాపు 1.2 లక్షల మంది హాజరవుతారని ఆయన అన్నారు.

Tags

Next Story