Bihar: అక్కడి సబ్బులకి భలే గిరాకీ .. దేనితో చేస్తారంటే

Bihar: అక్కడి సబ్బులకి భలే గిరాకీ .. దేనితో చేస్తారంటే
మెక పాలు, గ్లిజరిన్ కలిపి సబ్బుల తయారీ

ప్రస్తుత కాలంలో ముఖ సౌందర్యం కోసం వినియోగించే ఫేస్‌ మాస్కులు, క్రీములను ఇళ్లలో తయారు చేయడం చూస్తున్నాం. మార్కెట్‌లో దొరికే రసాయన తయారీ క్రీముల కన్నా ఇళ్లలో లభ్యమయ్యే టమాట, కలబంద, పెరుగు, కాఫీ వంటి వాటితోనే ఫేస్‌ ప్యాక్‌లు చేసుకోవడానికి ఎక్కువమంది ప్రాధాన్యం ఇస్తున్నారు. ఐతే సబ్బులను కూడా ఇళ్లలోనే తయారు చేస్తున్నారు బిహార్‌కు చెందిన కొందరు మహిళలు. మేకపాలు, గ్లిసరిన్‌తో పాటు ఇళ్లలో లభ్యమయ్యే కొన్ని పదార్థాలతో సువాసనలు వెదజల్లే సబ్బులను సిద్ధం చేస్తున్నారు.ఇళ్లలో లభ్యమయ్యే సహజ సిద్ధమైన పదార్థాలతో సబ్బులను తయారు చేస్తున్నారు

బిహార్‌లోని బగాహా ప్రాంతానికి చెందిన గిరిజన మహిళలు. సుమారు 200 మంది మహిళలు.. ఇళ్లలో సబ్బులు తయారు చేస్తూ స్వావలంబన సాధిస్తున్నారు. మేకపాలు, గ్లిసరిన్‌, వేప, మసూర్‌, కుంకుమపువ్వు, కలబంద, బొగ్గు, పసుపు, గంధం వంటి వాటిని ఇందుకోసం ఉపయోగిస్తున్నట్లు మహిళలు తెలిపారు.


స్థానికంగా ప్రకృతిహితమైన సబ్బులకు మంచి డిమాండ్‌ ఉన్నప్పటికీ.. కొత్త మార్కెట్‌ను సంపాదించుకోలేక పోతున్నామని మహిళలు తెలిపారు. ప్యాకేజింగ్‌తో పాటు బ్రాండింగ్‌ లేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. తమకు ప్రభుత్వం నుంచి సహాయం కావాలనీ.. సబ్బులను ప్యాక్‌ చేసేందుకు లేబుల్స్‌ కావాలని తెలిపారు. మంచి ప్యాకేజింగ్‌ చూస్తే కచ్చితంగా మార్కెట్‌ మరింత విస్తరిస్తుందని చెప్పారు. ఇక్కడి మహిళలకు ఉపాధి కల్పించడమే తమ ముఖ్య ఉద్దేశ్యమని వివరించారు

Tags

Read MoreRead Less
Next Story