Indian Railways: సిగ్నల్ సిస్టమ్ ఫెయిల్.. ఢీకొన్న రెండు గూడ్సు రైళ్లు

ఇండియన్ రైల్వేలో మరోసారి సిగ్నలింగ్ సిస్టమ్ ఫెల్యూర్ అయింది. పశ్చిమ బెంగాల్ ని బంకురాలో రెండు గూడ్సు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 బోగీలు పట్టాలు తప్పాయి. తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వండా స్టేషన్‌లో ఓ రైలును మరో రైలు వెనక నుంచి ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఓ గూడ్సు రైలు డ్రైవరుకు స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో గూడ్సు రైళ్లు ఖాళీగా ఉన్నాయి. అయితే, రైళ్లు రెండూ ఒకే ట్రాక్‌పైకి ఎలా వచ్చాయన్న విషయంలో స్పష్టత లేదు.
ప్రమాదంతో అడ్రా డివిజన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టాలు తప్పిన బోగీలను తొలగించి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించే పనులు చేపట్టారు. కాగా, ఈ నెల 2న ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో దాదాపు 292 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది గాయపడ్డారు. దేశంలోని అతిపెద్ద రైలు ప్రమాదాల్లో ఒకటిగా ఇది మిగిలిపోయింది. మరోసారి రెండు ట్రైన్స్ ఒకే ట్రాక్ పైకి రావడం చర్చనీయాంశంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com